చిత్రం చెప్పే విశేషాలు!

(05-03-2023/2)

టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన భారత స్టార్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ఆదివారం చివరిసారిగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఆడారు.

Source: Eenadu

ఒడిశా మాజీ సీఎం, తన తండ్రి బిజు పట్నాయక్‌ జయంతి సందర్భంగా ప్రస్తుత సీఎం నవీన్‌ పట్నాయక్‌ భువనేశ్వర్‌ విమానాశ్రయంలో ‘డకోటా’ విమానాన్ని జాతికి అంకితమిచ్చారు. ఈ విమానాన్ని గతంలో పైలట్‌గా బిజు పట్నాయక్‌ నడిపారు.

Source: Eenadu

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వేములవాడ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో ఆయన కోడెను కట్టి మొక్కును తీర్చుకున్నారు.

Source: Eenadu

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హను-మాన్‌’. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ జన్మదినం సందర్భంగా సినిమాలో ఆమె లుక్‌కు సంబంధించిన ఫొటోను చిత్రబృందం విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది. 

Source: Eenadu

అమరావతిలోని వీఐటీ విశ్వవిద్యాలయంలో ‘విటోపియా-2023’ ఉత్సవాల్లో భాగంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేడుకలకు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

Source: Eenadu

రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్‌ యాక్షన్‌ చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమా టీజర్‌ను మార్చి 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నందగావ్‌ గ్రామంలో లాఠ్‌మార్‌ హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏటా రాధాకృష్ణుల స్మారకంగా జరిగే ఈ వేడుకలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొంటారు. లాఠ్‌మార్‌ హోలీని ప్రేమ, స్నేహానికి గుర్తుగా అక్కడి ప్రజలు భావిస్తారు.

Source: Eenadu

నటుడు మంచు మనోజ్‌ దంపతులు భూమా మౌనికా రెడ్డి తాత, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డిని కర్నూలులో కలిశారు. అనంతరం నవదంపతులు.. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

Source: Eenadu

‘ఇండియన్‌ జ్యువెల్లర్‌ మ్యాగజైన్‌’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఫ్యాషన్‌ షో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మోడల్స్‌ పాల్గొని ర్యాంప్‌వాక్‌తో ఆకట్టుకున్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(23-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

Eenadu.net Home