చిత్రం చెప్పే విశేషాలు!
(07-03-2023/2)
దేశంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. వివిధ నగరాల్లో వీధులు రంగులతో నిండిపోయాయి. యువతీయువకుల కేరింతలతో ఆనందాల నవ్వులు వెల్లివిరిశాయి.
Source: Eenadu
గుంటూరు- విజయవాడ రహదారిలో పలువురు మూవబుల్ హౌసెస్ పరిశ్రమలు స్థాపించి లాభాలు ఆర్జిస్తున్నారు. 200 చదరపు అడుగుల నుంచి 360 చదరపు అడుగు విస్తీర్ణం వరకూ ఉన్న గృహాలు రూ.2.5 లక్షల నుంచి రూ.4లక్షల వరకు ధరతో నిర్మించి ఇస్తున్నారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.2లో కాలిబాటపైనా నాటిన మొక్కల దుస్థితి ఇది. ఎన్ని నాటామో లెక్కలు రాసుకున్న అధికారులు తర్వాత వాటి రక్షణపై శ్రద్ధ చూపకపోవడంతో పూర్తిగా ఎండిపోయి ఆనవాళ్లు కోల్పోయాయి.
Source: Eenadu
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘మహిళా సాధికారత, సమానత్వం’ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి విడదల రజని, మహిళా నాయకులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.
Source: Eenadu
నంద్యాల జిల్లాలోని అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. ఆలయ వీధుల్లో ఊరేగింపు చేశారు.
Source: Eenadu
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో మార్చి 12న జరిగే ఆస్కార్ వేడుకలకు హాజరయ్యేందుకు ఎన్టీఆర్ అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి బేవర్లీ హిల్స్ అందాలను ఇలా వీక్షిస్తున్న ఫొటోను తారక్ ట్విటర్‌లో పంచుకున్నారు.
Source: Eenadu
విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘లాల్ సలామ్’. ఈ చిత్రంలో రజనీకాంత్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను మంగళవారం ప్రారంభించారు.
Source: Eenadu
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ యాత్రలో కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Source: Eenadu