చిత్రం చెప్పే విశేషాలు..!
(09-03-2023/2)
భారత్, ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు వీక్షించేందుకు వచ్చిన ఇరు దేశాల ప్రధానులు మోదీ, ఆల్బనీస్..
Source: Eenadu
సినీనటి హనీ రోజ్ విశాఖపట్నంలోని ఓ నగల దుకాణాన్ని ప్రారంభించారు. నూతన ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
ప్రముఖ సినీనటుడు చిరంజీవి బుధవారం మహిళా దినోత్సవం సందర్భంగా తన కుమార్తె సుస్మితకు దుర్గామాత జ్ఞాపికను కానుకగా ఇచ్చారు.
Source: Eenadu
నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో రంగనాయకుల పేట, సంతపేట రోడ్డు, నాలుగు కాళ్ల మండపం వీధి భక్తులతో కిటకిటలాడాయి.
Source: Eenadu
బాలకృష్ణ, నయనతార ప్రధాన పాత్రల్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహా’ సినిమా 2010లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను ఈ నెల 11న రీరిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Source: Eenadu
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఖుషి’. ఈ సినిమా సెట్స్‌లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సమంత కేకు కోసి సంబరాలు చేశారు.
Source: Eenadu
మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్.. ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్‌కు ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంగీతానికి ఆయన అందించిన సేవలను సచిన్ కొనియాడారు.
Source: Eenadu
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఇండియన్ 2’. సినిమా చిత్రీకరణలో భాగంగా యాక్షన్ డిజైన్ బృందంతో కమల్ చర్చిస్తూ ఇలా కనిపించారు.
Source: Eenadu
అమెరికన్ నటి, గాయని కాట్ గ్రాహమ్ లాస్ ఏంజెలెస్‌లో నిర్వహించిన ‘టైమ్స్ ఆన్యువల్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ గాలా’ కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’పాదయాత్ర మదనపల్లి నియోజకవర్గంలో 500 కి.మీ మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు చరఖా తిప్పారు.
Source: Eenadu