చిత్రం చెప్పే విశేషాలు..!
(10-03-2023/2)
పవన్‌కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమా చిత్రీకరణ కోసం దర్శకుడు హరీష్ శంకర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి భారీ సెట్‌ను సిద్ధం చేశారు. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
Source: Eenadu
ఆస్కార్ వేడుకల నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న సినీనటుడు రామ్‌చరణ్ ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేజే అబ్రమ్స్‌ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న రామ్‌చరణ్.. ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని తెలుపుతూ పోస్టు పెట్టారు.
Source: Eenadu
ఆమె ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు అత్త. ఆమే.. పద్మభూషణ్ గ్రహీత సుధామూర్తి. అయినా ఎలాంటి ఆడంబరం లేకుండా తిరువనంతపురంలో మంగళవారం నిర్వహించిన అట్టుకల్ పొంగల వేడుకల్లో సాధారణ వ్యక్తిలా వంట చేస్తూ కనిపించారు.
Source: Eenadu
ఆస్కార్ వేడుకల్లో భాగంగా లాస్‌ఏంజెలెస్‌లోని పారమౌంట్ స్టూడియోలో నిర్వహిస్తున్న ‘సౌత్ ఏసియన్ ఎక్సలెన్సీ’ కార్యక్రమంలో ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పాల్గొని సందడి చేశారు. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా బృందం ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.
Source: Eenadu
భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న మహాత్మాగాంధీ స్మారకం వద్ద నివాళి అర్పించారు.
Source: Eenadu
విశాఖలోని సముద్ర తీరంలో ఉదయం వేళ ఓ వ్యక్తి యోగా చేశాడు. ఆ సమయంలో ఉదయిస్తున్న సూర్యుడు అతని చేతుల మీద ఉన్నట్లుగా ఇలా అందంగా కనిపించింది.
Source: Eenadu
యూకేకు చెందిన నటి లిలీ జేమ్స్ కాలిఫోర్నియాలో నిర్వహించిన ‘వెర్సేక్ వింటర్ కలెక్షన్’ ఫ్యాషన్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె నలుపు రంగు దుస్తుల్లో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య తేజస్విని, కుమారుడితో కలిసి.. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Source: Eenadu
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మదనపల్లిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్‌కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. మదనపల్లి పట్టణంలో పలువురు మత్స్యకారులు లోకేశ్‌ను వల, టోపీతో సత్కరించారు.
Source: Eenadu
కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మీటర్’. ఈ సినిమా ద్వారా కథానాయిక అతుల్య రవి తెలుగు తెరకు పరిచయమవుతున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకుంది.
Source: Eenadu
నల్గొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ మొబైల్ షాప్‌ను బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి, జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి ప్రారంభించి సందడి చేశారు.
Source: Eenadu