చిత్రం చెప్పే విశేషాలు..!
(12-03-2023/1)
అమరావతిలోని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరికీ అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్.
Source: Eenadu
శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం పట్టణం కండ్రకాలనీలో ఉన్న ఈ చెట్టు నిండా పూలతో ఆకట్టుకుంటోంది. నీలం, తెలుపు రంగులలో సుమారు రెండు ఇంచీల పొడవైన పుష్పాలతో కనువిందు చేస్తోంది.
Source: Eenadu
సాధారణంగా టమోటా మొక్క 3 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని ఈబీసీ కాలనీకి చెందిన కొర్రపాటి కుసుమకుమారి తన పెరటిలో నాటిన టమోటా మొక్క మాత్రం 8 అడుగుల వరకు పెరిగి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Source: Eenadu
నిండుకుండలా నీటితో కళకళలాడుతున్న శాలిగౌరారం ప్రాజెక్టు, పక్కనే భూమికి ఆకుపచ్చ రంగేసినట్లు కనిపిస్తున్న ఈ ప్రాంతం నల్గొండ జిల్లా శాలిగౌరారం సొంతం. పచ్చని పొలాలు, చెట్లు పంట కాల్వలు, జలకళతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.
Source: Eenadu
హైదరాబాద్‌లోని ఔటర్‌పై నిర్మిస్తున్న సైకిల్ ట్రాక్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్రాక్ వెంట ఏర్పాటుచేసిన కళాకృతుల ఫొటోలను హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ట్విట్ చేశారు.
Source: Eenadu
దిల్లీలోని సెంట్రల్ పార్కులో శనివారం జీ-20 పుష్పోత్సవంలో ఆకట్టుకున్న ఇండియాగేట్ పూల నమూనా.
Source: Eenadu
హైదరాబాద్ హకీంపేట్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
Source: Eenadu
ఇండోనేసియాలోని మౌంట్ మెరాపి అనే అగ్నిపర్వతం శనివారం విస్ఫోటం చెందింది. దాని నుంచి భారీగా వేడి వాయువులు, లావా, బూడిద వెలువడుతున్నాయి. ఇవి ఏడు కిలోమీటర్ల దూరం వరకూ వ్యాపించాయి.
Source: Eenadu