చిత్రం చెప్పే విశేషాలు..!
(12-03-2023/2)
నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కోసం కేరళ వెళ్లిన నాని అక్కడి సీఫుడ్‌ను రుచి చూశారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీఎస్‌ఐసీ, స్టుమాగ్జ్ ఆధ్వర్యంలో యూత్ కార్నివాల్ ఏర్పాటు చేశారు. వివిధ స్టాల్స్‌ను ఏర్పాటు చేసి యువతలోని ప్రతిభను వెలికితీశారు. దీంతో పాటు నృత్య ప్రదర్శనలు, సైక్లింగ్, బైక్ రైడింగ్ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
Source: Eenadu
పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం నిర్వహించనున్న సందర్భంగా తిరుపతిలోని పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు.
Source: Eenadu
హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం మూత్ర పిండాల దినోత్సవం, మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు మూత్రపిండాల ప్లకార్డులను ప్రదర్శించారు.
Source: Eenadu
టెక్సాస్‌లో ‘65వ వరల్డ్ లార్జెస్ట్ రాటిక్ స్నేక్ రౌండప్’ నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ రకాల భారీ రాటిల్ స్నేక్స్‌ను ప్రదర్శనకు ఉంచారు.
Source: Eenadu
లాస్‌ఏంజెలెస్ పర్యటనలో ఉన్న ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఓ పార్టీలో ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రెండన్ ఫ్రేజర్‌ను కలిసి ముచ్చటించారు.
Source: Eenadu
ఆస్కార్ వేడుకల నేపథ్యంలో లాస్‌ఏంజెలెస్‌లో పర్యటిస్తున్న రామ్‌చరణ్.. ‘మీట్ అండ్ గ్రీట్’లో పాల్గొని ఫ్యాన్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ‘బిజినెస్ వుమెన్ ఎక్స్‌పో’ సందర్భంగా 10కె, 5కె రన్ నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని పరుగులు తీశారు.
Source: Eenadu