చిత్రం చెప్పే విశేషాలు..!

(16-03-2023/1)

తమిళనాడులోని సేలంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి మూడు నెలల క్రితం ఓ వ్యక్తి గుండెపోటు కారణంగా చికిత్స కోసం చేరారు. ఆయన పెంపుడు శునకం కూడా అక్కడికి వచ్చింది. రోగి చికిత్స పొందుతూ మృతి చెందారు. కానీ, ఆయన అక్కడే ఉన్నారని భావించి మూడు నెలలుగా పెంపుడు శునకం నిరీక్షిస్తోంది.

Source:Eenadu

ఈ తార పేరు వూల్ఫ్‌-రాయెట్‌ 124. ఇది మరణం అంచున ఉంది. చుట్టుపక్కల అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తున్న నీహారిక.. నక్షత్రంలో చోటుచేసుకున్న అల్లకల్లోలం వల్ల దాని నుంచి బయట పడిన ధూళితో ఏర్పడింది. 

Source:Eenadu

జి-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో విశాఖపట్నంలోని ఆర్కేబీచ్‌ రోడ్డులో చేపట్టిన సుందరీకరణ పనులు ఊపందుకున్నాయి. రహదారికి ఆనుకొని ఉన్న గార్డెన్‌లో పచ్చని పచ్చిక, మొక్కలను నాటి అందంగా తీర్చిదిద్దుతున్నారు.

Source:Eenadu

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవొమ్మంగిలో బుధవారం వింత సన్నివేశం చోటుచేసుకుంది. కుక్కపిల్లను ఓ కోతిని ఎత్తుకుంది. విడిపిద్దామని స్థానికులు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కుక్కపిల్లతో పాటు కోతి అడవిలోకి పారిపోయిన దృశ్యాన్ని పలువురు చరవాణుల్లో బంధించారు.

Source:Eenadu

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి.మాడుగుల పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు ఆకులన్నీ మార్చి మొదటి వారంలో రాలిపోయాయి. అంతలోనే కొమ్మలన్నీ పచ్చదనంతో నిండాయి. ఈనెల ఆరో తేదీన ఆకులు రాల్చిన, 15న పచ్చగా కళకళలాడుతున్న చిత్రాలను మీరూ చూడండి.

Source:Eenadu

తల్లిదండ్రుల ఆంక్షలు.. పోలీసుల హెచ్చరికలు.. ఇవేమీ పట్టించుకోరు వారు. ద్విచక్రవాహనం అందుబాటులో ఉంటే చాలు, ఎంతమందైనా ఎక్కేస్తారు. బుధవారం విశాఖపట్నంలోని గొలుగొండలో కుర్రాళ్లు ఇలా ప్రయాణించారు.

Source:Eenadu

ఇంటర్‌మీడియట్‌ పరీక్షలు బుధవారం ఆరంభమయ్యాయి. విశాఖపట్నం నగరంలోని పలు కేంద్రాల వద్దకు విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా తరలివచ్చారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే వరకూ దగ్గరుండి పలు సూచనలు చేశారు. బీవీకే కళాశాల వద్ద పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు.

Source:Eenadu

అనకాపల్లిలోని చీడికాడ ప్రాథమిక పాఠశాల సమీపంలో చెరువు క్రికెట్‌ మైదానాన్ని తలపిస్తోంది. చెరువులో నీటిపై నాచు తేలింది. నీరు ఏమాత్రం కనిపించలేదు. క్రికెట్‌ మైదానంలా మారిన చెరువును పలువురు ఆసక్తిగా చూస్తున్నారు.

Source:Eenadu

చిత్రం చెప్పే విశేషాలు (25-04-2024/1)

రెడ్‌ బ్యూటీ..

నేనే బొమ్మనైతే...

Eenadu.net Home