చిత్రం చెప్పే విశేషాలు...!

(17-03-2023/2)

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పాప్‌ జంక్షన్ స్ప్రింగ్ సమ్మర్‌ పేరిట వస్త్రాభరణాల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లు, బ్లాగర్స్‌ పాల్గొని సందడి చేశారు.

Source: Eenadu

మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రిషభ్‌ పంత్‌ను కలిసి పరామర్శించారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న యువరాజ్‌.. త్వరలోనే ఛాంపియన్‌ తిరిగొస్తాడు అని పోస్టు పెట్టారు. 

Source: Eenadu

సినీనటి కీర్తి సురేష్‌ తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘జస్ట్‌ ఫర్‌ ఫన్‌’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. నానితో కలిసి ఆమె నటించిన ‘దసరా’ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదల కానుంది.

Source: Eenadu

ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ‘మెన్స్‌ నంబర్‌ వన్‌ టెస్టు బౌలర్‌’గా ఖ్యాతి గడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

Source: Eenadu

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేశం సుసంపన్నంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

Source: Eenadu

ముంబయిలో జరుగుతున్న భారత్‌, ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్‌ను చూసేందుకు తలైవా రజనీకాంత్‌ వాంఖడే స్టేడియానికి విచ్చేసి సందడి చేశారు.

Source: Eenadu

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ శుక్రవారం ఉదయం దేశ రాజధానికి విచ్చేశారు. తన సతీమణి ఉపాసనతో దిల్లీకి వచ్చిన ఆయనకు ఎయిర్‌పోర్ట్‌ వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. 

Source: Eenadu

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వారు చర్చించుకున్నారు.

Source: Eenadu

చెన్నై టి. నగర్‌లోని పద్మావతి తాయారు ఆలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

Source: Eenadu

ఉపేంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కబ్జ’ విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా సినీనటి తాన్య హోప్‌ ఇలా మెరిశారు.

Source: Eenadu

గెలుపోటములు సహజం.. ఇదే నిజం!

సొగసు చూడ తరమా..!

జాన్వీ కొత్త సినిమా మొదలైంది.. చూశారా!

Eenadu.net Home