చిత్రం చెప్పే విశేషాలు..!

(20-03-2023/1)

సికింద్రాబాద్‌ స్టేషన్‌ ముందు అగి ఉన్న బస్సులు ట్రాఫిక్‌ జామ్‌తో బయటకు వెళ్లలేని పరిస్థితి. బస్సులూ రోడ్డుపై వరుసగా ఆగిపోవటంతో రైలును తలపిస్తోంది.

Source: Eenadu

హైదరాబాద్‌లోని రాయదుర్గం టీవర్క్స్‌ సమీపంలో నిర్మిస్తున్న భారీ భవనానికి అద్దాలు బిగించారు. వాటిని సరి చూసేందుకు కార్మికులు యంత్రం సాయంతో ఇలా వెళ్తున్నారు.

Source: Eenadu

నీటి మధ్యలో చిన్నపాటి ద్వీపంలా కనిపిస్తున్న ఈ చిత్రం హుస్సేన్‌సాగర్‌లోనిదే.. సాగర్‌లో నెక్లెస్‌ రోడ్డువైపు మట్టితో కృత్రిమ ద్వీపంలా ఏర్పాటు చేసి.. దానిపై పచ్చదనం పెంచాలన్న హెచ్‌ఎండీఏ నిర్ణయంతో పనులు సాగుతున్నాయి. 

Source: Eenadu

ఆదిలాబాద్‌లోని బోథ్‌ అడవిని కొత్త అతిథి పలకరించింది. అందమైన రూపంతో ఆకర్షిస్తున్న ఈ పక్షి బ్లాక్‌ హూడెడ్‌ ఒరియోల్‌. ఇండోనేషియా, శ్రీలంక దేశాలలో నివసించే ఈ పక్షి బోథ్‌ రేంజీ పరిధి నేరడిగొండ మండలం కుప్టి, కుమారి అడవుల్లో శనివారం కనిపించింది.

Source: Eenadu

పెద్ద సైజు పచ్చిమిర్చిలా ఉన్నది బీరకాయో, సొరకాయో అనుకుంటే పొరపాటే. విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి మండలం దోసలపాడుకు చెందిన పక్కుర్తి నూకరాజు ఇంటి పెరట్లో బొప్పాయి చెట్టుకు కాసిన చిన్న కాయ ఇది. 

Source: Eenadu

ఇసుక ధరలు బంగారంలా మారాయి. దీంతో కొంతమంది సమూహంగా మారి కృష్ణా నదిలో ఇలా ఇసుక మూటలుగా కట్టి తీసుకెళ్తున్నారు. అమరావతిలోని కృష్ణలంక రాణిగారితోట వద్ద ఆదివారం కనిపించిన చిత్రాలివి.

Source: Eenadu

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌లు మురికిగా మారడంతో నాలుగు రోజులుగా సిబ్బంది ప్రత్యేక యంత్రంతో శుభ్రం చేస్తున్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని మల్లాపూర్‌ మైఫ్లవర్‌ అపార్టుమెంట్‌ సముదాయంలోని ఓ భారీ వృక్షం శనివారం రాత్రి ఈదురుగాలులకు పార్కు చేసిన కారుపై పడింది. కారు పైభాగం పూర్తిగా ధ్వంసమైంది.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు (24-04-2024/1)

బెంగళూరులో వర్షాలు.. ప్రణీత సంబరాలు

చిత్రం చెప్పే విశేషాలు (23-04-2024/1)

Eenadu.net Home