చిత్రం చెప్పే విశేషాలు..!

(20-03-2023/2)

నయన్‌ విఘ్నేశ్‌లు తమ పిల్లలతో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘ఆనందం అనేది మనకు ఇష్టమైన వారితో ఉన్నప్పుడు జరిగే ప్రతిదానితో ముడిపడి ఉంటుంది. ప్రేమే ఆనందం, ఆనందమే ప్రేమ’ అంటూ క్యాప్షన్ జత చేశారు.

Source: Eenadu

నటుడు నాని, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ‘దసరా’ ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. కాగా నాని తన ట్విటర్‌ ఖాతాలో ‘10 డేస్‌ టు గో’ అంటూ పోస్టు చేశారు.

Source: Eenadu

హీరో విశ్వక్‌సేన్‌ తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘దస్‌ కా దమ్కీ’ మార్చి 22న విడుదలకు సిద్ధమైంది. 

Source: Eenadu

నాగశౌర్య హీరోగా పవన్‌ బాసంసెట్టి దర్శకత్వంలో ఓ సినిమా ‘ఎన్‌ఎస్‌ 23’(వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతోంది. ఈ నెల 22న ఉగాది కానుకగా సినిమా టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి కలిసి నటించిన చిత్రం‘మీటర్‌’. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సింబియాసిస్‌ లా స్కూల్‌లో నిర్వహించిన యాన్యువల్‌ ఫెస్ట్‌కు చిత్ర నటీనటులు హాజరై సందడి చేశారు.

Source: Eenadu

కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు కల్యాణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కోస్టి’. యోగిబాబు, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ‘కోస్టి’ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుపుతూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను విడుదల చేసింది.

Source: Eenadu

సల్మాన్‌ ఖాన్‌ - పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ పాడిన పాట టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మంగళవారం పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ కీలక పాత్రల్లో జబర్దస్త్‌ ఫేమ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవాను కలిశారు.

Source: Eenadu

రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమాకు సంబంధించిన ‘డిక్క డిష్యూం’అనే మాస్‌ సాంగ్‌ను మార్చి 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ కథానాయిక. సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయి వెళ్లిన నాని అక్కడి స్టైల్‌లో ఆటో దిగుతూ కనిపించారు.

Source: Eenadu

ఇటీవల పట్టభద్రుల కోటాలో గెలిచిన తెదేపా ఎమ్మెల్సీలను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న ఆయన.. ‘కష్టపడి పని చేయండి.. మంచి పేరు తెచ్చుకోండి’ అని పోస్టు పెట్టారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(24-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

Eenadu.net Home