చిత్రం చెప్పే విశేషాలు..!

(21-03-2023/2)

శోభకృత్‌ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది ప్రసాదానికి వినియోగించే దినుసులను పూర్ణకుంభంతో సహా మర్రిఆకుపై సుందరంగా చిత్రీకరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి చెందిన విశ్రాంత చిత్రలేఖనం ఉపాధ్యాయులు పచ్చా పెంచలయ్య వేసిన ఈ దృశ్యం ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

ప్రకృతి ఒడిలో మైమరిచిపోయేలా ఉండే వాతావరణం.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతిస్తున్నారు..

Source: Eenadu

మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో భాగంగా చిత్రబృందం లండన్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో మణిరత్నంతో లండన్‌లో కలిసి దిగిన ఫొటోను ఏ.ఆర్‌. రెహమాన్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 

Source: Eenadu

హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని మెగా ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక నృత్యాలు, ర్యాంప్‌వాక్‌లు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Source: Eenadu

హైదరాబాద్‌ మణికొండ పురపాలక పరిధిలో ఇటీవల ప్రారంభించిన చిత్రపురి కాలనీ ప్రహరీ గోడలపై వివిధ రకాల పక్షులు, జంతువులు, పూలు, గ్రామీణ పర్యావరణ బొమ్మలు వేశారు. దీంతో ఈ చిత్రాలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Source: Eenadu

కరీంనగర్‌లో భారత రాష్ట్ర సమితి జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా వినోద్ కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌ ఇలా ముచ్చటించారు. నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Source: Eenadu

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వర్షంతో పంటలకు నష్టం వాటిల్లడంతోపాటు ఇళ్ల పైకప్పులకు చిల్లులు పడ్డాయి. సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలో ఓ బియ్యం మిల్లు పైకప్పునకు ఇలా పెద్దసంఖ్యలో చిల్లులు పడ్డాయి.

Source: Eenadu

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని పరిమళ సుగంధ ద్రవ్యాలతో పరిశ్రుభం చేశారు.

Source: Eenadu

అణువణువూ అలలెగసే...

చూడకండి సిగ్గేస్తుంది

చూపు తిప్పుకోలేకపోతున్నాం

Eenadu.net Home