చిత్రం చెప్పే విశేషాలు...!
(24-03-2023/1)
అనంతపురం జిల్లా కేంద్రం నుంచి తాడిపత్రికి వెళ్లే రహదారిలో బుక్కరాయసముద్రం నుంచి శింగనమల చెరువు మలుపు వరకు సుమారు 12 కి.మీ. మేర రహదారి విభాగినిపై ఎత్తుగా పెరిగిన చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
Source: Eenadu
వేసవి కావడంతో పక్షులకు, జంతువులకు దాహార్తి తీర్చేందుకు హైదరాబాద్‌లోనిభాగ్యనగర్ కాలనీలో దుకాణాల ముందు ఓ తొట్టిలో నీటిని ఉంచారు. మధ్యాహ్నం పూట జంతువులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి.
Source: Eenadu
జీ20 సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా గురువారం విశాఖపట్నం నగర వాసులకు గాలిపటాల పోటీలు నిర్వహించారు. వివిధ రకాల పతంగులు వీక్షకులను అలరించాయి.
Source: Eenadu
వరంగల్‌లోని హంటర్‌రోడ్ బొందివాగు వంతెన నుంచి 12 మోరీల కూడలి వరకు ప్రధాన రహదారి ఎత్తు పెంచేందుకు కంకర, డస్ట్ పోశారు. పనులు ఆలస్యమవుతుండటంతో వారం, పది రోజులుగా దుమ్ము, ధూళితో స్థానిక వ్యాపారులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు.
Source: Eenadu
వేసవికాలం వచ్చినా.. శీతాకాల వాతావరణం ఏర్పడుతోంది. గురువారం ఉదయం కమ్ముకున్న మంచు తెరలు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని శ్వేతమయంగా మార్చాయి. కొండచుట్టూ, ఆలయ నగరి ప్రాంగణాలు మంచులో మెరిసిపోయాయి.
Source: Eenadu
ఎన్నో రూ.లక్షలు వెచ్చించి నాటిన హరితహారం మొక్కలు మూగజీవాలకు ఆహారంగా మారుతున్నాయి. హైదరాబాద్‌లోనినెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద విభాగినిపై నాటిన మొక్కలకు సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో మేకలు ఇలా మేస్తున్నాయి.
Source: Eenadu
తొలగించిన కరెంటు స్తంభాన్ని వైర్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇలా ప్రమాదకరంగా తరలిస్తున్నారు. పొరపాటున చేయి జారితే వారితో పాటు పక్కన ప్రయాణించేవారికీ ప్రమాదకరమే.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ పైవంతెన వద్ద కనిపించిందీ చిత్రం.
Source: Eenadu
ఎన్టీపీసీ రామగుండంలో నిర్మిస్తోన్న తెలంగాణ ప్రాజెక్ట్‌లో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఒకటో యూనిట్‌లో సింక్రనైజేషన్ పూర్తిచేశారు.
Source: Eenadu