చిత్రం చెప్పే విశేషాలు...!
(27-03-2023/2)
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. చరణ్‌ను ముద్దాడుతున్న ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న.. హ్యాపీ బర్త్‌డే’ అంటూ క్యాప్షన్ జత చేశారు.
Source: Eenadu
బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ దంపతులకు కుమార్తె జన్మించింది. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్.. ‘దేవుడు నాకు కుమార్తె రూపంలో సంతోషాన్ని అందించాడు’ అంటూ ఈ ఫొటోను ట్విటర్ వేదికగా సోమవారం పంచుకున్నారు.
Source: Eenadu
అత్యాధునికమైన 16 ఏసీ స్లీపర్ ‘లహరి’ బస్సులను టీఎస్‌ఆర్టీసీ కొనుగోలు చేసింది. అందులో 9 బస్సులను సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఎల్బీనగర్‌లో ప్రారంభించారు.
Source: Eenadu
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఎ.వి.ధర్మారెడ్డి.. ఒంటిమిట్ట సీతారామ కల్యాణానికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వానపత్రికను వారు సీఎంకు అందజేసి వేడుకలకు రావాల్సిందిగా కోరారు.
Source: Eenadu
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తన ముంబయి ఇండియన్స్ జెర్సీని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
Source: Eenadu
సినీనటి నభా నటేశ్ తన తాజా ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్ ముగ్ధులవుతున్నారు..
Source: Eenadu
నితిన్, నిత్యామీనన్ జంటగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇష్క్’. 2012లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నెల 29 నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
Source: Eenadu
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్ ఫొటోను విడుదల చేశారు.
Source: Eenadu
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. నేడు రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌కు సంబంధించిన ఫొటోను చిత్రబృందం విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది.
Source: Eenadu
నాని, కీర్తి సురేశ్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. సినిమాలోని ఫోర్త్ సింగిల్ ‘ఓ అమ్మలాలో అమ్మలాలో’ పాటను మంగళవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Source: Eenadu
‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమా ఆడియో, ట్రైలర్‌ను ఈ నెల 29న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించింది.
Source: Eenadu