చిత్రం చెప్పే విశేషాలు..!

(02-04-2023/2)

హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో ఆదివారం ఉదయం జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో అహింసా రన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని పరుగు తీశారు.

Source: Eenadu

నాని కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.71కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. 

Source: Eenadu

సినీనటి రాశీఖన్నా తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్టుకు ఆమె ఫ్యాన్స్‌ లైక్‌లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాశీఖన్నా నటించిన ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. 

Source: Eenadu

సరిగ్గా ఇదే రోజున 12 ఏళ్ల క్రితం భారత్‌.. వన్డే ప్రపంచకప్‌ పోటీల్లో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆరోజును ఎప్పటికీ మరిచిపోలేనని చెబుతూ మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌ ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 

Source: Eenadu

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులోకి అడుగుపెట్టి 10ఏళ్లు అవుతున్న సందర్భంగా భువనేశ్వర్‌ కుమార్‌ జట్టు సభ్యుల మధ్య కేకు కోసి సంబరాలు చేసుకున్నారు.. 

Source: Eenadu

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఉప్పల్‌ స్టేడియం వద్ద ఫ్యాన్స్‌ సందడి నెలకొంది. చీర్‌గర్ల్స్‌ ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. 

Source: Eenadu

శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఇండియన్‌ 2’. ఈ సినిమా చిత్రీకరణను ప్రస్తుతం తైవాన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ శంకర్‌ ఈ ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 

Source: Eenadu

సినీనటి శివానీరాజశేఖర్‌ ఫొటోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. పసుపు రంగు చీరలోఉన్న ఆమెఫొటోకుఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.. 

Source: Eenadu

సినీనటి కీర్తి సురేశ్‌ దసరా సినిమా సెట్స్‌లో ‘సిల్కు బార్’ వద్ద దిగిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. సెట్‌ తొలగించే సమయంలో పరుగెత్తి మరీ.. ఈ ఫొటో తీసుకున్నట్లు ఆమె చెప్పారు.

Source: Eenadu

ఉప్పల్‌లో జరిగిన హైదరాబాద్, రాజస్థాన్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ను ప్రముఖ సినీనటుడు వెంకటేశ్‌ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన చప్పట్లతో సన్‌రైజర్స్‌ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

Source: Eenadu

చెన్నైలో నిర్వహించిన ‘బిహైండ్‌ వుడ్స్‌ గోల్డ్‌ ఐకాన్స్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో సినీనటి నయనతార ఇలా మెరిశారు. చెన్నైలో నిర్వహించిన ‘బిహైండ్‌ వుడ్స్‌ గోల్డ్‌ ఐకాన్స్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో సినీనటి నయనతార ఇలా మెరిశారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(27-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

Eenadu.net Home