చిత్రం చెప్పే..విశేషాలు..!

(04-04-2023/2)

తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయాప్ప స్వామి వారిని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

Source: Eenadu

ఆంధ్రప్రదేశ్‌ సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ‘మహావీర్ జయంతి’ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహావీరుడి చిత్రపటానికి సీఎం జగన్, నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు.

Source: Eenadu

కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేష్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కని చిత్రం ‘మీటర్‌’. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అతుల్య రవి మెగాస్టార్‌ చిరంజీవిని కలిసింది. 

Source: Eenadu

కరీంనగర్‌లోని ఓ పాఠశాలలో స్క్రైబ్ సాయంతో పదో తరగతి పరీక్షలు రాసి బయటకు వస్తున్న అంధ విద్యార్థులు.

Source: Eenadu

నటి నిధి అగర్వాల్ చీరకట్టులో మెరిసిన తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ అందమైన ఫొటోలకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.

Source: Eenadu

నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. ఈ చిత్రం విడుదలైన 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి. మల్లవరంలోని శ్రీ దేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు..

Source: Eenadu

సీనియర్‌ దర్శకుడు కె. విజయభాస్కర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జిలేబి’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఏప్రిల్‌ 6న హీరో వెంకటేష్‌ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

‘30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్యరావు, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. ఈ సినిమాలోని ‘రంగమ్మ’ లిరికల్ పాటను హీరో ప్రియదర్శి చేతుల మీదుగా ఏప్రిల్‌ 6న ఉదయం 9.09 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(27-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

Eenadu.net Home