చిత్రం చెప్పే విశేషాలు..!
(07-04-2023/2)
నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర అనంతపురం జిల్లా శింగనమలలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో బాలయ్య లోకేశ్‌తో కలిసి నడిచారు. అడుగడుగునా ప్రజలకు అభివాదం చేస్తూ.. బాలయ్య కార్యకర్తల్లో జోష్ పెంచారు.
Source: Eenadu
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ముందుగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని కొత్తగూడ పాలపిట్ట సైక్లింగ్ పార్కులో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా హైదరాబాద్ ఆక్టివ్ మోబిలిటీ, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు సైక్లింగ్ నిర్వహించారు.
Source: Eenadu
అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
Source: Eenadu
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని ఓ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. ఈ సాంగ్ సెట్‌లో భాగంగా శేఖర్ మాస్టర్, అనిల్ రావిపూడి కలిసి దిగిన ఓ ఫొటోను చిత్రబృందం పంచుకుంది.
Source: Eenadu
విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తమిళంలో తెరకెక్కించిన చిత్రం ‘విడుతలై పార్ట్ 1’. ఈ సినిమా తెలుగులో ‘విడుదల పార్ట్ 1’ గా రానుంది. సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 8న ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Source: Eenadu
ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న సికింద్రాబాద్- తిరుపతిల మధ్య నడవనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లో సిబ్బంది, పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు..
Source: Eenadu
బాచుపల్లి నిజాంపేటలోని ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్‌లో సీనియర్ సిటిజెన్స్ కోసం ‘గోల్డెన్ ఏజ్ హెల్త్ ప్యాకేజీ’ని జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు..
Source: Eenadu
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చరిత్రాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ నటి శోభితా ధూళిపాళ ఈ సినిమాలో వనతి పాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ ఫొటోను ట్వీట్ చేసింది.
Source: Eenadu
ఇండియా ట్రిప్‌లో ఉన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కుమార్తెతో కలిసి శుక్రవారం ముంబయిలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా ఆమె పంచుకున్నారు.
Source: Eenadu