చిత్రం చెప్పే విశేషాలు...!
(09-04-2023/1)
విశాఖలోని వీఎంఆర్డీఏ పార్కులో, సీతకొండ వద్ద ఈ సౌర చెట్టు ఏర్పాటు చేశారు. పది ఇనుప గొట్టాలు, పది ఇనుప రేకులతో చేసిన పత్రాలు ఉన్నాయి. దీనికి రూ.4లక్షలు కూడా వ్యయం కాదు. దానికి రూ.12 లక్షలు ఖర్చు చేసినట్లు జీవీఎంసీ పేర్కొనడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
Source: Eenadu
హనుమకొండ బస్టాండు సమీపంలో కల్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సినీ నటి హనీరోజ్
Source: Eenadu
హైదరాబాద్‌లోని గండిపేట ఎంజీఐటీ కళాశాలలో ఎస్సై రాత పరీక్ష రాసేందుకు మహబూబ్‌నగర్‌కు చెందిన అఖిల తన రెండు నెలల పసికందుతో వచ్చింది. సహాయకులు ఎవరూ లేకపోవడంతో అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ కన్యాకుమారి, పాపను తీసుకొని లాలించింది.
Source: Eenadu
విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తంగలాన్’. ఏప్రిల్ 17న విక్రమ్ జన్మదినం సందర్భంగా సినిమా గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Source: Eenadu
ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. నిత్యారాధనల్లో కుటుంబ సభ్యులతో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ధర్మ దర్శనం కోసం మూడు గంటలు వేచి ఉండాల్సి వచ్చిందని ఆ కాంప్లెక్స్‌లోని భక్తులు అన్నారు.
Source: Eenadu
స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ నుంచి ఖాజాగూడ చెరువు వరకు కిడ్నీ వాక్ నిర్వహించారు. మూత్రపిండాల ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. నగరవాసులు ఉత్సాహంగా వాక్‌లో పాల్గొన్నారు.
Source: Eenadu
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
Source: Eenadu
మెదక్‌లోని గుల్షన్ క్లబ్‌లోని టేకు చెట్ల పరిస్థితి ఇది. గతేడాది జూన్, జులై నెలల్లో ఈ చెట్లతో క్లబ్ ప్రాంగణం పచ్చదనం సంతరించుకుంది. ప్రస్తుత వేసవిలో సూర్యుడి ప్రతాపానికి చెట్ల ఆకులు రాలిపోయి ఇలా కనిపిస్తున్నాయి.
Source: Eenadu
ప్రధాని మోదీ నేడు కర్ణాటకలోని బండీపుర టైగర్ రిజర్వును సందర్శించారు. ఖాకీ ప్యాంట్, కామోఫ్లాజ్ టి-షర్ట్, స్లీవ్‌లెస్ జాకెట్ ధరించిన మోదీ ఉత్సాహంగా కనిపించారు.
Source: Eenadu