చిత్రం చెప్పే విశేషాలు..!
(12-04-2023/1)
బతుకుదెరువు కోసం ద్విచక్ర వాహనంపై కొబ్బరి బోండాలు తీసుకెళ్లడం వరకు బాగానే ఉంది.. కానీ వాటిపై మరో వ్యక్తి ఇలా కూర్చోని ప్రయాణించడమే ప్రమాదకరంగా ఉంది. ఏదైనా జరిగితే ద్విచక్రవాహనదారులకే కాదు.. ఎదురుగా వచ్చే వారికీ ముప్పే.. ఈ చిత్రం సంస్థాన్ నారాయణపురంలో కంటపడింది.
Source: Eenadu
సూర్యుడి ప్రతాపంతో వాతావరణం వేడెక్కుతోంది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో మండుటెండలో మంగళవారం మధ్యాహ్నం యాదగిరిగుట్ట, పంచనారసింహుల ఆలయం చెంత ఇలా నిర్మానుష్యం ఏర్పడింది. భక్తులు లేక ఆలయ ప్రవేశ ద్వారం (తూర్పు గోపురం) వద్ద బోసిపోయి కనిపించింది.
Source: Eenadu
కొచ్చిలో జరిగిన మిసెస్ ఇండియా పోటీల్లో టోలిచౌకికి చెందిన అంకితా ఠాగూర్ విజయం సాధించారు. మంగళవారం యూనిక్‌టైమ్స్ సంస్థ నిర్వహించిన ఫైనల్స్‌లో న్యాయనిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు.
Source: Eenadu
జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా ఎల్.కోట మండలం జమ్మాదేవిపేట సమీపంలోని మహాత్మా జ్యోతిబాఫులే బీసీ బాలికల వసతిగృహం విద్యార్థులు మంగళవారం ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు ఇలా ఫులే, సావిత్రీబాయి వేషధారణల్లో అలరించారు.
Source: Eenadu
కీరవాణి తనయుడు శ్రీసింహ, ‘బలగం’ ఫేమ్ కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో ఫణిదీప్ తెరకెక్కించిన సినిమా ‘ఉస్తాద్’. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో నటీనటులు ఇలా మెరిశారు.
Source: Eenadu
ఐపీఎల్ 16లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టు దిల్లీపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ముంబయి ఇండియన్స్’ ట్విటర్ ఖాతాలో ‘ఫస్ట్ విన్, నంబర్ విన్’ అని తెలుపుతూ రోహిత్‌శర్మ ఫొటోను పంచుకుంది.
Source: Eenadu
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో విరించ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల ఆటపాటలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
Source: Eenadu
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలను భానుడు హడలెత్తించాడు. మంగళవారం వడగాల్పుల ప్రభావం అధికమైంది. పనుల మీద బయటకు వెళ్లేందుకు ప్రజలు ఎండ నుంచి రక్షణకు గొడుగులు, తువ్వాళ్లు తదితరాలు వినియోగించారు.
Source: Eenadu