చిత్రం చెప్పే విశేషాలు..!

(16-04-2023/2)

‘పొన్నియిన్‌ సెల్వన్ 2’ చిత్ర నటీనటులు విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి కోయంబత్తూరులో ఇలా మెరిశారు. ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: Eenadu

బాలీవుడ్‌ నటుడు కార్తీక్‌ ఆర్యన్‌.. ‘ఫెమీనా మిస్ ఇండియా’ కిరీటాన్ని దక్కించుకున్న నందిని గుప్తా, రన్నరప్‌లుగా నిలిచిన శ్రేయా పూన్జా, తౌనోజమ్‌ స్ట్రెలా లువాంగ్‌లతో కలిసి ఫొటో దిగారు. 

Source: Eenadu

అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’. సాక్షి వైద్య కథానాయిక. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సాక్షి ఇలా మెరిశారు.

Source: Eenadu

మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు ఉదయం స్వామి, అమ్మవార్ల అభిషేక సేవలో ఆయన పాల్గొన్నారు. 

Source: Eenadu

హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో నిర్వహించిన ‘వెల్ బేబీ షో’ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. తల్లులకు కిట్లను అందజేసిన అనంతరం ఆయన పిల్లలను ఎత్తుకొని ముద్దు చేశారు.

Source: Eenadu

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భాష్యకారుల ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలో రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.

Source: Eenadu

సినీనటి పూజాహెగ్డే తన తాజా ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. అంతా కలలాగా ఉంది అని తెలుపుతూ పోస్టు పెట్టారు. సల్మాన్‌ఖాన్‌, వెంకటేశ్‌తో కలిసి ఆమె నటించిన సినిమా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: Eenadu

చైనాలోని ఝాంగ్‌షూ నగరంలో ప్రజలు ఇలా సరస్సు నీటిపై తేలియాడే పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. దీంతో పాటు వారు సరస్సులో చిన్న ఈల్‌ చేపలను వదులుతూ కనిపించారు.

Source: Eenadu

భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఇలా పాకుతున్న ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘దిల్‌ తో బచ్చా హై జీ’(మనసు చిన్న పిల్లవాడి లాంటిది) అని ఫన్నీగా పోస్టు పెట్టారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ‘బలగం’ సినిమా నటీనటులు ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ శివజ్యోతి పాల్గొని సందడి చేశారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(29-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(28-07-2025)

Eenadu.net Home