చిత్రం చెప్పే విశేషాలు..!

(22-05-2023/1)

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆర్టీఏ, పోలీసు అధికారులు ఎంత చెప్పినా కొందరు పట్టించుకోవడం లేదు. తోపుడుబండిని ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి వెనక్కి తిరిగి కూర్చొని ప్రమాదకరంగా ఇలా తీసుకువెళ్లారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌ చౌరస్తా నుంచి బంజారాహిల్స్‌ అక్కడి నుంచి మెహదీపట్నం, లక్డీకపూల్‌ వరకు ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Source: Eenadu

నల్గొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం మూడుగుడిసెల తండాలో 20 రోజులుగా మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇలా నీటి కోసం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్తున్నారు.

Source: Eenadu

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన అనిల్‌ భల్లా(78) 16 ఏళ్ల వయసు నుంచే గడియారాలు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఆయన ఇంట్లో సుమారు 650 గడియారాలు కనిపిస్తాయి. 

Source: Eenadu

కృష్ణా జిల్లా బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరించారు.

Source: Eenadu

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా నాలుగు జట్లు GT, CSK, LSG, MI ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జట్లకు అభినందనలు తెలుపుతూ ‘ఐపీఎల్‌’ తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకుంది.

Source: Eenadu

విశాఖపట్నం ఆర్కే బీచ్‌ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. సాగరం సాయంత్రం ఓ సమయంలో దాదాపు 300 మీటర్లు వెనక్కి వెళ్లడంతో భారీ రాళ్లు బయటపడ్డాయి. పలువురు వీటిపైకి చేరి స్వీయచిత్రాలు తీసుకున్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరం చుట్టూ హెచ్‌ఎండీఏ మరిన్ని సొబగులు అద్దుతోంది. తాజాగా పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లో దుప్పి ఆకారంలో కళాకృతులను అమర్చడంతో ఆ ప్రాంతం ఆకర్షణీయంగా కన్పిస్తోంది.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home