చిత్రం చెప్పే విశేషాలు..!

(23-05-2023/2)

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఊహించని విధంగా ఓ ట్రక్కులో ప్రత్యక్షమయ్యారు. దిల్లీ నుంచి చండీగఢ్‌ వెళ్తున్న ఆయన.. మార్గమధ్యంలో కారు దిగి, ఓ ట్రక్కు ఎక్కి ప్రయాణించారు. ఆ ట్రక్కులో ఆయన చండీగఢ్‌ వరకు చేరుకుని అక్కడ డ్రైవర్‌లతో కలిసి భోజనం చేశారు. 

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య మంగళవారం చెన్నైలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల కెప్టెన్‌లు ధోనీ, హార్దిక్‌ పాండ్యలకు సంబంధించిన ఓ ఫొటోను సీఎస్‌కే తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. 

 సిడ్నీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ఫేమస్‌ చెఫ్‌ సారా టాడ్‌ కలిశారు. అనంతరం భారతదేశ వంటకాల గురించి వీరిద్దరు చర్చించుకున్నారు.

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య మంగళవారం చెపాక్‌ స్టేడియంలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా బ్రావో, నెహ్రా ఇలా ముచ్చటించుకుంటున్న ఫొటోను గుజరాత్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో బెంగళూరు జట్టు లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో కూడిన ఓ తాజా ఫొటోను ఆర్‌సీబీ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ‘ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చాం. వచ్చే ఏడాది అభిమానులను అలరిస్తాం’ అని ట్వీట్‌ చేసింది.

బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణాలో డిజైర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

 పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తోన్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో రానున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ ‘మార్కండేయులు(మార్క్‌)’ పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ ఫొటోను ట్వీట్‌ చేసింది.

చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. 

తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ‘ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రెస్‌’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అమెరికన్‌ సొసైటీ ఆఫ్ సివిల్‌ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు.

చిత్రం చెప్పే విశేషాలు (12-04-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు(12-04-2024/1)

నానో న్యూస్‌ (12/ 04/ 2024)

Eenadu.net Home