చిత్రం చెప్పే విశేషాలు..
(17-07-2023/1)
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఆస్య ఫౌండేషన్ ‘ప్రకృతి కోసం కలిసి నడుద్దాం’ పేరిట ఆదివారం నెక్లెస్ రోడ్డులో వాకథాన్ నిర్వహించింది.
శునకాలను పెంచుకునే యజమానులు, వివిధ రకాల కుక్కలను చూడాలనుకునే వారితో ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డు కళకళలాడుతుంది. కుటుంబాలతో సహా వచ్చి సరదాగా కాలక్షేపం చేస్తున్నారు.
అందంగా, పలు వర్ణాలతో మెరిసిపోతున్న ఈ పక్షి పేరు సన్ బర్డ్. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ చెట్టు కొమ్మపై తలకిందులుగా వేలాడుతూ మకరందాన్ని జుర్రుకుంటోంది.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం జనసందోహంగా మారింది. ఆదివారం పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి పాలనురగలా జాలువారుతున్న నీటిధారలను తిలకిస్తూ పరవశించిపోయారు.
అనకాపల్లి జిల్లా కేంద్రంలోని నూకాలమ్మ ఆలయం ఆవరణలో ఆదివారం మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు టమాటాలతో తులాభారం నిర్వహించారు.
చౌటుప్పల్ పురపాలిక పరిధి లక్కారంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కోతుల బెడద ఎక్కువైంది. ప్రహరీపై నుంచి తరగతి గదులపైకి దూకుతున్నాయి. దీంతో విద్యార్థులు భయపడుతున్నారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. అమావాస్య, సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.
తితిదే ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఆదివారం శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.