చిత్రం చెప్పే విశేషాలు..
(07-08-2023/2)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి చేరుకొని ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. పలువురు మంత్రులు కూడా గద్దర్‌కు నివాళి అర్పించారు. గద్దర్ కుటుంబసభ్యులను కేసీఆర్ ఓదార్చారు.
జనగామ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం సమీపంలో హనుమకొండ-హైదరాబాద్ ప్రధాన రహదారిలో విభాగినిపై పెంచుతున్న మొక్కలకు పూసిన వివిధ రంగుల పూలు ఆకట్టుకుంటున్నాయి.
షారుఖ్ ఖాన్, నయన తార, ప్రియమణి ప్రధాన పాత్రల్లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ చిత్రం ‘జవాన్’. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ మేరకు షార్‌ఖ్ ఖాన్ ఫొటోను ట్విటర్‌లో పంచుకుంది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన శంకర్ అనే కళాకారుడు.. ప్రజా గాయకుడు గద్దర్ సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది ఆయనకు నివాళి అర్పించారు. కరీంనగర్‌లోని మంకమ్మ తోట ఏరియాలో ఈ సైకత శిల్పాన్ని రూపొందించి ఆయన తెలంగాణకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి నేతృత్వంలో తొమ్మిది మంది దాతలు కలిసి తితిదేకు రూ.5.11కోట్లు విరాళం అందించారు. దాతలు ఈ మొత్తానికి సంబంధించిన డీడీని సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.
చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. చింతలపూడి ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును వైకాపా అటకెక్కించడాన్ని ప్రశ్నిస్తూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు అనంతపురం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గేటు తోసుకొని లోనికి వెళ్లే ప్రయత్నంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది.
ఎల్బీ స్టేడియంలో ఉంచిన గద్దర్ పార్థివదేహానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. అనంతరం పవన్.. గద్దర్ కుటుంబసభ్యులతో మాట్లాడి ఓదార్చారు.