చిత్రం చెప్పే విశేషాలు..

(15-08-2023/2)

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పోలీసు కవాతు మైదానంలో విద్యార్థులు నేలపైనే నృత్యం చేశారు. విద్యార్థులు ఇబ్బంది పడుతూ.. నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం నిర్వాహకులు స్పందించి మ్యాట్‌ అమర్చారు.

ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్, టీమ్‌ఇండియా మధ్య మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌ కోసం భారత ఆటగాళ్లు ఐర్లాండ్‌కు బయలుదేరిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. ఈ టూర్‌లో టీమ్‌ఇండియాకు బుమ్రా నాయకత్వం వహించనున్నాడు.

సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి జంటగా ‘సత్య’ (Satya) అనే మ్యూజికల్‌ షార్ట్‌ ఫీచర్‌ రూపొందింది. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ ఫీచర్‌కు నవీన్ విజయ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది సోల్‌ ఆఫ్‌ సత్య’ పాటను విడుదల చేశారు.

పంద్రాగస్టు సందర్భంగా ఆర్కేబీచ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు నిర్వహించిన సమైక్య వాక్‌లో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత ఆర్కేబీచ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరిగింది. రోజూ 50 వేల మంది డొమెస్టిక్‌, 10 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఉన్నత విద్య కోసం రోజూ 5 వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. అమెరికా, కెనడాకు అధిక సంఖ్యలో విద్యార్థులు వెళ్తున్నారు.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్‌ విద్యార్థులు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్యాషన్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద జాతినుద్దేశించి ప్రసంగించారు. 140 కోట్ల మంది భారతీయులకు ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ‘లవ్‌ ఆల్‌’ మూవీ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. నటీనటులు హాజరై చిత్ర విశేషాలు పంచుకున్నారు. కార్యక్రమానికి బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాల్గొన్నారు. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(07-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(06-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(06-05-2025)

Eenadu.net Home