చిత్రం చెప్పే విశేషాలు..
(28-09-2023/1)
నిమజ్జనానికి తరలించే ఏర్పాట్లలో భాగంగా ఖైరతాబాద్ మహా గణపతి మండపాన్ని బుధవారం తొలగించారు. సాయంత్రం భారీ వర్షం కురవడంతో విగ్రహం తడవకుండా ఇలా పాలిథిన్ కవర్ కప్పి.. వాన ఆగాక తొలగించారు.
తూర్పు గోదావరిలోని జీఎస్‌ఎల్ పారా మెడికల్ కళాశాల ఐదో స్వాగత కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన కేంద్రంగా రూపొందించేందుకు వైటీడీఏ కృషి కొనసాగిస్తోంది. యాత్రికుల కోసం విశాల రహదారులతో పాటు, మానసికంగా ఆహ్లాదాన్ని కలిగించే పచ్చదనం పోషణ పర్వాన్ని నిర్వహిస్తున్నారు.
గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు గీసిన వినాయకుడి చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఎస్సార్‌నగర్‌లోని ఆర్ట్ గ్యాలరీలో పిల్లలు గీసిన చిత్రాలను ప్రదర్శించారు.
నెక్లెస్ రోడ్డులో మంగళవారం మంత్రి తలసాని ప్రారంభించిన వాటర్ ఫ్రంట్ పార్క్ హైదరాబాద్‌లో సరికొత్త విశేషాన్ని సంతరించుకుంది. ఈ పార్క్‌లో నాటిన మొక్కలన్నింటి శాస్త్రీయ నామాలు, వాడుక పేర్లు, పూలు, పండ్లు, ఇతర చరిత్రను క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తమై ఉన్నాయి.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బారెడు పొద్దెక్కే వరకు పొగమంచు వ్యాపిస్తోంది. బుధవారం నాడు జహీరాబాద్, చేగుంట 65, 44వ జాతీయ రహదారులు, శివ్వంపేట ప్రాంతం దట్టమైన మంచు మధ్య చిక్కుకున్నాయి.
సినీతార హనీరోజ్ బుధవారం నెల్లూరులో సందడి చేశారు. ఓ వాణిజ్య సముదాయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె.. సంప్రదాయ చీరలో.. చక్కటి చిరునవ్వుతో హొయలొలికించారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ తెదేపా శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి తెదేపా యువనేత ఆడారి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో దిల్లీలోని ఇండియా గేట్ నుంచి ఏపీ భవన్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.