చిత్రం చెప్పే విశేషాలు
(29-09-2023/1)
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకుపై ఎం.ఎస్.స్వామినాథన్ చిత్రాన్ని మలిచి నివాళులు అర్పించారు.
ఖమ్మం నగరంలోని మున్నేరులో విగ్రహాలను బుధవారం నిమజ్జనం చేశారు. నీటిమట్టం తక్కువగా ఉండటంతో ప్రతిమలు పూర్తిస్థాయిలో మునగలేదు. గురువారం తెల్లవారుజాము నుంచే జాలర్లు, వీధి వ్యాపారులు కరిగిన విగ్రహాల నుంచి వెలుగుచూసే ఇనుము కోసం వేట సాగించారు.
ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద గురువారం ఫొటోకు పోజిచ్చిన మిస్ యూనివర్స్ గ్రేట్ బ్రిటన్-2023 జెసీకా పేజ్.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో గురువారం గంగమ్మ ఒడికి తరలివెళుతున్న గణనాథుడు. నిమజ్జనోత్సవంలో భాగంగా రాత్రి 9 గంటల వరకు సుమారు 20,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అయినట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని దయిగూడ, పిప్పల్‌ధరి, లోహర, మామిడిగూడ, తంతోలి గ్రామాలివి. ఖండాల ఘాట్ రోడ్డు నుంచి ఇలా కనిపిస్తున్నాయి. కొండల మధ్య లోయలో చెట్లు, పంట చేలతో అలరిస్తున్న ఈ గ్రామాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనం ఆకర్షణీయంగా మారింది. దశాబ్దాల కిందట నిర్మించిన పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో వివిధ గ్రాంట్లు, నిధుల నుంచి సుమారు రూ.39 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించారు.
రాజస్థాన్ జైపూర్‌లో ఈనెల 23న ‘ఫర్ ఎవర్ స్టార్ ఇండియా’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫర్ ఎవర్ మిసెస్ ఇండియా (సీజన్-3) పోటీల్లో గాజువాక డ్రైవర్స్‌కాలనీకి చెందిన బెహరా దివ్య విజేతగా నిలిచారు.
శ్రీకాకుళంలోని కొండరాగోలుకి చెందిన తెదేపా నేత వై.నాగేశ్వరరావు కుమార్తె యాళ్ల స్రవంతి రక్తంతో తెదేపా అధినేత చంద్రబాబు చిత్రం వేసి ఆయనకు మద్దతుగా నిలిచారు. తన తండ్రి నుంచి రక్తం సేకరించి బాబు చిత్రం వేసినట్లు తెలిపారు.