చిత్రం చెప్పే విశేషాలు..

(15-10-2023/1)

సూర్యగ్రహణం సందర్భంగా శనివారం అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం శాన్‌ ఆంటోనియో నగరంలో అవిష్కృతమైన దృశ్యం.

శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆలిండియా శారీ మేళాలో భాగంగా శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కళాప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

వారాంతం, దసరా సెలవులు రావడంతో యువతులు, విద్యార్థినులు, మహిళాలు చార్మినార్‌ పరిసరాల్లో సందడి చేశారు.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం పక్కన మాల్‌కుంట రోడ్డులో వెదురుబుట్టలతో కాగితాల బతుకమ్మల తయారీలో తల్లిదండ్రులకు తోడ్పడుతున్న చిన్నారులు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో పాటలతో హైదరాబాద్‌లోని ప్రతి వీధి మార్మోగింది.

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో అంగన్‌వాడీ చిన్నారులతో వీడియో గేమ్‌ ఆడిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.

పచ్చదనంతో కళకళలాడుతున్న వరి పొలాలు, మధ్యలో వలిసాబు గుట్ట.. నీలాకాశంతో కనువిందు చేస్తున్న ఈ దృశ్యం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోనిది.

శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విపరీతమైన రద్దీ నెలకొంది. స్టేషన్‌ ప్రాంగణమంతా ప్రయాణికులతో నిండిపోయిది.

మహాలయ అమావాస్య సందర్భంగా శనివారం కోల్‌కతాలోని హుగ్లీ నది ఒడ్డున పితృ సంతర్పణంలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.

చిత్రం చెప్పేవిశేషాలు(26-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ చెప్పిన సూక్తులు (శతజయంతి)

Eenadu.net Home