చిత్రం చెప్పే విశేషాలు..

(29-10-2023/1)

సంప్రదాయ కళారూపాలను ఒకే వేదికపై ప్రదర్శించి వీక్షకులను ఆకట్టుకున్నారు కళాకారులు శనివారం సాయంత్రం తారామతి-బారాదరిలో జరిగిన నాట్య తోరణం కార్యక్రమం ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సాగింది.

గాలి ఆధారంగా బావిలోని నీటిని పైకి తోడే పాతకాలం యంత్రంలా కనిపిస్తోంది కదూ. ఈ కాలం సృజనకు తోడైన వాటర్‌ ఫౌంటెయిన్‌ ఇది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.44లోని ఓ ఇంటీరియర్‌ దుకాణం ముందు చూపరులను ఆకట్టుకుంటోంది.

సాధారణంగా మామిడితోటలో అంతర పంటగా కూరగాయలు సాగు చేయడం చూస్తుంటాం.కరీంనగర్‌ జిల్లా మల్లన్నపల్లిలోని రైతులు జాడి శ్రీనివాస్, జాడి లింగయ్య వివిధ రకాల పంటలు సాగు చేస్తూ విజయవంతమవుతున్నారు.

గుంటూరు ప్రజలకు తాగునీటిని అందించే నీటి పథకం వద్ద అపరిశుభ్రత తాండవిస్తోంది. పాత నీటి సంపులు ఖాళీ చేయకపోవడంతో అందులో నిల్వ ఉన్న మురుగు శుభ్రం చేసిన నీటితో కలుస్తోందంటూ ఆయా ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు.

బతుకమ్మ సంబరాలకు ఆదిలాబాద్‌ పట్టణంలోని లిటిల్‌స్టార్‌ హైస్కూల్‌ వేదికగా నిలిచింది. ఆ పాఠశాలలో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఇసామియాబజార్‌లో నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి నిర్వాహకుడు గులాబ్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కొలువుదీరిన 55 అడుగుల భారీ దుర్గామాత విగ్రహ నిమజ్జనం శనివారం రాత్రి శోభాయమానంగా జరిగింది.

విజయవాడలో శనివారం ప్రముఖ నటి శ్రీలీల సందడి చేసింది. నందమూరి బాలకృష్ణతో కలిసి శ్రీలీల నటించిన ‘భగవంత్‌ కేసరి’ చిత్ర విజయోత్సవ వేడుకల్లో భాగంగా నగరానికి విచ్చేసింది.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ప్రముఖ గజల్ సంగీతకారుడు తలత్ అజీజ్ మ్యాజికల్ గజల్ కచేరీ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. 

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home