చిత్రం చెప్పే విశేషాలు..! (02-10-2022/2)
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు సోమవారం 3వేల బతుకమ్మలతో ర్యాలీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మహిళలు బతుకమ్మలను సిద్ధం చేస్తూ కనిపించారు.
Image:Eenadu
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో హైలైఫ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమంలో బిగ్‌బాస్ ఫేమ్, నటి అషూరెడ్డి పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Image:Eenadu
తెలంగాణలోనే అతిపెద్ద అమ్మవారి విగ్రహం కోఠి ఇస్లామియా బజార్‌లో ఏర్పాటు చేశారు. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఓ భక్తుడు ఏర్పాటు చేసిన 45 అడుగుల అమ్మవారి మట్టి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Image:Eenadu
పీవీ సింధు సూరత్‌లోని కిస్‌నా నేచర్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి మకావ్ తదితర పక్షులతో పాటు పర్షియన్ పిల్లిని ముద్దు చేస్తూ సందడి చేశారు.
Image:Eenadu
లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ ట్విటర్‌లో ఆయనకు సంబంధించిన ఈ అరుదైన ఫొటోను పంచుకొని నివాళి అర్పించారు.
Image:Eenadu
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన అశోక్ శ్రీనాథ్ అనే యువకుడు పెన్సిల్ మొనపై చరఖా, రాగితీగతో 0.4 మిల్లీమీటర్ల పరిమాణంలో కళ్లజోడును రూపొందించాడు.
Image:Eenadu
గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం మహాత్ముడి సేవలను గుర్తు చేసి.. విగ్రహానికి నివాళి అర్పించారు.
Image:Eenadu
విశాఖలో ఏర్పాటు చేసిన ఓ నూతన నగల దుకాణం ప్రారంభోత్సవానికి సినీ నటి నిక్కీ గల్రానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Image:Eenadu
అమెరికాలో ఇయన్ హరికేన్ సృష్టించిన బీభత్సానికి నిదర్శనం ఈ చిత్రం. ఫ్లోరిడాలోని ఫోర్ట్ మియర్స్ నుంచి పైన్ ఇలాండ్‌కు వెళ్లే వంతెన పూర్తిగా దెబ్బతింది. దీంతో ఇక్కడికి చేరుకోవాలంటే జల, వాయు మార్గంలో మాత్రమే వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది.
Image:Eenadu
హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు మహాత్ముడి విగ్రహం వద్ద నివాళులర్పించారు.
Image:Eenadu