చిత్రం చెప్పే విశేషాలు..! (03-10-2022/2) 

సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసంలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మను పేర్చారు.

Image:Eenadu

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ ఒడిశాలోని పూరీ తీరంలో కేసీఆర్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. తెరాస నేత అలిశెట్టి అరవింద్.. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సైకత శిల్పి సాహుతో ఈ శిల్పాన్ని రూపొందింపజేశారు.

Image:Eenadu

మిస్‌ ఎర్త్‌ ఇండియా-2019 తేజస్విని మనోజ్ఞ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి హరిత స్ఫూర్తి చాటారు.

Image:Eenadu

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు.

Image:Eenadu

నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో నిర్వహించిన దసరా వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పాల్గొన్నారు.

Image:Eenadu

దసరా ఉత్సవాలలో ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.దివ్యరూపిణి అయిన దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Image:Eenadu

రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ తొలిసారి ఓ హిందీ పాటకు స్వరాలు సమకూర్చారు. అది కూడా సినిమాయేతర పాట. ‘ఓ పరి’ అంటూ సాగే ఆ గీతాన్ని మంగళవారం బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఆవిష్కరించనున్నారు.

Image:Eenadu

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు గుర్తుగా ఆయన విగ్రహాన్ని తన కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నారు టాలీవుడ్‌ నటుడు దగ్గుబాటి రానా. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. గతేడాది గుండెపోటుతో పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే.

Image:Eenadu

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని లక్ష్మీతాయారు అమ్మవారు సోమవారం వీరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home