చిత్రం చెప్పే విశేషాలు..! (08-10-2022/2)

హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో రోగులను తీసుకువెళ్లే వీల్‌ఛైర్లను ఇలా ఆసుపత్రి పత్రాలు, బెడ్‌షీట్లు, సామగ్రి తరలింపునకు వినియోగిస్తున్నారు. దీంతో రోగులు వీల్‌ఛైర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.

#Eenadu

భారత వైమానిక దళ 90వ వార్షికోత్సవాలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సుపై సుమారు 80 విమానాలతో ప్రదర్శించిన విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

#Eenadu

సినీ నటుడు మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరమ్మ దశదిన కర్మను శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి బాలకృష్ణ హాజరై మహేశ్‌బాబును పరామర్శించారు.

సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘వైశ్య లైమ్‌లైట్‌ అవార్డ్స్‌ ఫర్‌ వుమెన్‌-2022’ నిర్వహణ తేదీని నవంబర్‌ 26గా ప్రకటించారు. కార్యక్రమంలో నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపు పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

#Eenadu

ప్రముఖ సినీ నటుడు రానా.. ఖాజాగూడలోని స్పర్శ్‌ హోస్పైస్‌లో నూతన వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి క్యాన్సర్‌ రోగులను పరామర్శించడంతో పాటు సిబ్బందితో కలిసి సెల్ఫీ తీసుకున్నారు.

#Eenadu

ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గాడ్‌ఫాదర్’. ఈ సినిమా అక్టోబర్‌ 5న దసరా కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం 6గంటలకు ‘బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌మీట్‌’ నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

#Eenadu

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ చెన్నైకి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌’ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.

#Eenadu

తిరుమలలో గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. తమిళుల పెరటాసి మాసం మూడో శనివారం నేపథ్యంలో తమిళనాడు నుంచి భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు.దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి...

#Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home