చిత్రం చెప్పే విశేషాలు..! (11-10-2022/2)
తిరుమల శ్రీవారిని ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ దర్శించుకున్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
#Eenadu
అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు ఉత్తరప్రదేశ్ వెళ్లారు. ములాయం పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.
#Eenadu
విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు తదితరులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
#Eenadu
అనంతపురం నగరంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో నడిమివంక పొంగిపొర్లింది. లోతట్టు ప్రాంతాలైన రజకనగర్, శాంతినగర్, సోమనాథనగర్, స్వామినగర్‌లోని రోడ్లపై వరద నీరు ప్రవహించింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
#Eenadu
‘బింబిసార’ విజయోత్సాహంతో నందమూరి కల్యాణ్‌రామ్ తన 19వ చిత్రం షూటింగ్ చకచకా పూర్తి చేస్తున్నాడు. ఇటీవలే గోవాలో ఓ షెడ్యూల్ పూర్తయిందని.. చివరి షెడ్యూల్ త్వరలో మొదలు కాబోతోందని పేర్కొంటూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది.
#Eenadu
చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాలోని ‘తార్‌మార్ తక్కర్‌మార్...’ వీడియో గీతాన్ని బుధవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
#Eenadu
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో (చివరి) వన్డేలో ఓ వీధి కుక్క మైదానంలోకి వచ్చింది. శ్రేయస్ అయ్యర్ దాన్ని బయటకు వెళ్లమంటూ ఇలా సైగలు చేశాడు.
#Eenadu