చిత్రం చెప్పే విశేషాలు..! (12-10-2022/2)

జైద్‌ ఖాన్‌, సోనాల్‌ మోన్‌టైరో జంటగా జయతీర్థ తెరకెక్కించిన చిత్రం ‘బనారస్‌’. నవంబర్‌ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నటీనటులు, చిత్రబృందం సోమవారం నెల్లూరులోని బారా షహీద్‌ దర్గాను సందర్శించుకొని చాదర్‌ సమర్పించి ప్రార్థనలు చేశారు.

#Eenadu

గత రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా అనంతపురంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ఇళ్లలో సరకులు తడిచిపోవడంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

#Eenadu

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో తితిదే ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేంకటేశ్వర కల్యాణ మహోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

#Eenadu

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఎంపీ శశిథరూర్‌ గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన చరఖాను తిప్పి నూలు వడికారు. గాంధీజీ నిరాడంబరంగా జీవించిన గొప్పవ్యక్తి అని తెలిపారు. ఆయన బోధనలు ప్రతిఒక్కరూ ఆచరించదగ్గవని చెప్పారు.

#Eenadu

ఐఎన్‌ తర్కష్‌.. దక్షిణాఫ్రికాలోని గ్రెకుహ్రియా తీరాన్ని చేరుకుంది. భారత్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలు ఉమ్మడిగా నిర్వహించనున్న ఏడో విడత IBSAMAR విన్యాసాల కోసం భారత నౌక అక్కడికి వెళ్లింది.

#Eenadu

విరాట్‌ కోహ్లీ జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ కసరత్తులు చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దీన్ని సూర్యకుమార్‌ యాదవ్‌ చిత్రీకరించినట్లు తెలిపారు. పరిస్థితులకు తగ్గట్లు మారడం ముఖ్యం అంటూ విరాట్‌ పోస్టు పెట్టారు.

#Eenadu

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో జియో స్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ కాంగ్రెస్‌ సదస్సు మూడో రోజు కొనసాగింది. ఇందులో భాగంగా పలువురు కళాకారులు ఇచ్చిన నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

#Eenadu

రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ ఖాతాలో మరో ఫిలింఫేర్‌ అవార్డు చేరింది. ఆయన స్వరాలు సమకూర్చిన ‘పుష్ప- ద రైజ్‌’ చిత్రం బెస్ట్‌ మ్యూజిక్‌ ఆల్బంగా ఎంపికైంది. ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఇప్పటికే తీసుకున్న 9 అవార్డులకు.. తన 10వ అవార్డు జతచేసి దేవిశ్రీ ఇలా ఫొటోకు పోజిచ్చారు.

#Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home