చిత్రం చెప్పే విశేషాలు..! (13-10-2022/2)

హైదరాబాద్‌ నగరానికి చెందిన చిన్నా ఈ విధంగా మెడకు, చేతులకు బంగారు ఆభరణాలు ధరించి చూపరులను ఆకట్టుకుంటున్నాడు. బాగ్‌లింగంపల్లిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనతో ఫొటోలు దిగేందుకు అక్కడికి వచ్చిన వారంతా ఆసక్తి చూపారు.

Image:Eenadu

మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ పూర్తయిన తర్వాత మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గ పరిధి శివన్నగూడెంలోని ఫ్లోరైడ్‌ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకొని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి స్వామి ఇంట్లో భోజనం చేశారు.

Image:Eenadu

భారత వైమానిక దళం 90వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ బరేలిలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఎయిర్‌ షో నిర్వహించారు. ఇందులో భాగంగా పారాచ్యూట్‌లతో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

Image:Eenadu

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని చిత్రాలివి. ఓఆర్ఆర్ సమీపంలోని కత్వా పైనుంచి పడుతున్న నీరు సుందర జలపాతంలా దర్శనమిస్తోంది. యువకులు ఇక్కడ ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Image:Eenadu

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సరికొత్త అల్ట్రా క్లాస్‌ లుక్‌లోకి మారిపోయారు. ఈ హెయిర్‌స్టైల్‌ తానే చేశానని సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్‌ అలీం హకీం తన సెలూన్‌లో తీసిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. మహేశ్‌ లుక్‌ చూసి ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Image:Eenadu

సినీ నటులు సల్మాన్‌ఖాన్‌, వెంకటేశ్‌లతో కలిసి నటి పూజా హెగ్డే తన జన్మదిన వేడుకలు చేసుకున్నారు. వీరు ముగ్గురు కలిసి నటిస్తున్న ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సందర్భంగా సినిమా సెట్‌లో కేకు కోసి బర్త్‌డే వేడుకలు నిర్వహించారు.

Image:Eenadu

కార్తి కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సర్దార్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘సర్దార్‌’ దీపావళి కానుకగా అక్టోబర్‌ 21న థియేటర్లలో విడుదల కానుంది.

Image:Eenadu

ఉక్రెయిన్‌ దేశం డోనెట్స్క్‌ రీజియన్‌ నుంచి తీసుకొచ్చిన అనాథ పిల్లలకు రష్యా ఆశ్రయమిస్తోంది. యుద్ధం నేపథ్యంలో తీసుకొచ్చిన వీరిని రష్యన్లుగా పెంచేందుకు చర్యలు చేపట్టింది.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home