చిత్రం చెప్పే విశేషాలు..! (14-10-2022/2)
ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రామ్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని ప్రతిరోజు అందరూ గుడ్లు తిని ఆరోగ్యంగా ఉండాలని చెబుతూ ఇలా గుడ్లను చూపించారు.
#Eenadu
వరుణ్‌తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న సినిమా ‘వీటీ12’(వర్కింగ్ టైటిల్)ను ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా షూటింగ్ మధ్య విరామంలో వరుణ్‌తేజ్ లండన్ వీధుల్లో సేదతీరుతూ కనిపించారు.
#Eenadu
మునుగోడు ఉపఎన్నికలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన డా.వసంతరాయల రాజ్‌పతి వినూత్నంగా గుర్రంపై వచ్చి నామినేషన్ వేశారు. బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఈ యువ డాక్టర్ తెలిపారు.
#Eenadu
జిన్నా మూవీ ప్రమోషన్‌లో భాగంగా మంచు విష్ణు, పాయల్ రాజ్‌పూత్ అనంతపురానికి వచ్చారు. ఈ సందర్భంగా పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
#Eenadu
మునుగోడు ఉపఎన్నికలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఉన్నారు.
#Eenadu
హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని నివాసం ఉంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య ఇంట్లోకి శుక్రవారం మధ్యాహ్నం త్రాచు పాము ప్రవేశించింది. అదే కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ డీజీపీ రాజీవ్ త్రివేదికి సమాచారం అందించగా.. ఆయన కృష్ణయ్య ఇంటికి చేరుకొని ఆ పామును నేర్పుతో బంధించారు.
#Eenadu
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక చోట్ల విద్యుత్ తీగలకు.. చెట్ల తీగలు అల్లుకుంటున్నాయి. నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో కనిపించిన దృశ్యాలివి. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
#Eenadu
హైదరాబాద్ నగర శివారు తట్టిఅన్నారంలో గత రెండు సంవత్సరాలుగా చెరువు నిండి ఇళ్లలోకి నీరు చేరుతోంది. అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించకపోవడంతో కాలనీవాసులే స్వయంగా మట్టిని తెచ్చుకుని తమ ఇళ్ల ముందు ఇలా కుప్పలుగా పోసుకున్నారు.
#Eenadu