చిత్రం చెప్పే విశేషాలు..! (16-10-2022/2)

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వీడియోకు సంబంధించిన ఫొటోలు ఇవి. ఇందులో రష్యా పైలట్‌ తన ఎస్‌యూ-25 యుద్ధ విమానం నుంచి ఉక్రెయిన్‌పై క్షిపణిని ప్రయోగిస్తూ కనిపించాడు.

#Eenadu

ఆదివారం సాయంత్రం హుస్సేన్‌సాగర్‌ వద్ద ఆకాశం మేఘావృతమై ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. సెలవు దినం కావడంతో అక్కడికి తరలివచ్చిన సందర్శకులతో సందడిగా కనిపించింది.

#Eenadu

ప్రముఖ సినీ నటుడు విజయ్‌ దేవరకొండ జమ్మూ కశ్మీర్‌ సరిహద్దులోని ఉరి సెక్టార్‌కు వెళ్లారు. అక్కడి జవాన్లతో ముచ్చటించి వారితో ఫొటోలు సైతం తీసుకున్నారు.

#Eenadu

ఉడిపిలోని కొల్లూరు మూకాంబిక దేవాలయాన్ని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

#Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో హైలైఫ్‌ బ్రైడ్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటి మాళవిక శర్మ పాల్గొని సందడి చేశారు.

#Eenadu

మెక్సికన్‌ నటి, గాయని ఐజా గొంజాలెజ్‌.. లాస్‌ ఏంజిలెస్‌లో నిర్వహించిన అకాడమీ మ్యూజియమ్‌ గాలా రెండో వార్షికోత్సవంలో పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

#Eenadu

దీపావళి పండగ సమీపిస్తుండటంలో హైదరాబాద్‌ అంబర్‌పేటలోని కుమ్మరి బస్తీలో పలువురు మట్టి ప్రమిదలను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు.

#Eenadu

విశాఖలో జనవాణి కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పలువురు కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను అందజేశారు.

#Eenadu

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ‘రన్‌ ఫర్‌ క్వాలిటీ’ కార్యక్రమం నిర్వహించారు. యువ కథానాయకుడు అడివి శేష్‌ జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు.

#Eenadu 

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే క్రమంలో పొరపాటున వేరే పరీక్ష కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులను సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సకాలంలో పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చారు.

#Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home