చిత్రం చెప్పే విశేషాలు..! (18-10-2022/2)

గాజులరామారం డివిజన్‌లోని బాలాజీ లేఔట్‌, వోక్షిత్ ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో ఎగువనున్న పెద్ద చెరువు నిండింది. దీంతో నీరంతా కాలనీల్లో ప్రవహిస్తోంది. ఆ నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో రోడ్లపై నాచుపట్టి ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇలా మురుగునీటిలో జారిపడుతున్నారు.

#Eenadu

ఏలూరు జిల్లా దెందులూరు మండలం గుండుగొలను కూడలి వద్ద 125 ఏళ్ల క్రితం ఆంగ్లేయులు నిర్మించిన వంతెన సగం వరకు కూలిపోయింది. మిగిలిన కాస్త స్థలంలో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.

#Eenadu

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ‘డిజైర్‌ ఎగ్జిబిషన్‌’ను యువ కథానాయికలు శ్రీలేఖ, హర్షిణి ఇతర మోడళ్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడళ్లు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

#Eenadu

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో జపాన్‌లో విడుదల కానుంది. దీంతో భీమ్‌ పాత్రలో మెప్పించిన నటుడు ఎన్టీఆర్‌ ప్రచార కార్యక్రమాల నిమిత్తం జపాన్‌కు బయలుదేరారు.

#Eenadu

విజయవాడ నోవాటెల్ హోటల్‌లో బస చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఇటీవల విశాఖలో పవన్‌ చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్న ఘటనపై చంద్రబాబు ఆరా తీశారు.

#Eenadu

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా గట్టుప్పల్‌లో భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కర్రసాము చేస్తూ ఆకట్టుకున్నారు.

#Eenadu

కడప విమానాశ్రయంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయన రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు.

#Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home