చిత్రం చెప్పే విశేషాలు..! (24-09-2022/2)

ఆదివారం ఉప్పల్‌లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌ కోసం భారత్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వారంతా పార్క్‌ హయాత్, తాజ్‌ కృష్ణా హోటళ్లకు బయలుదేరారు.

Image:Eenadu

హాంగ్‌కాంగ్‌లో ఓ వేడుకలో భాగంగా అగ్నిమాపక దళం, అంబులెన్స్‌ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో పరేడ్‌ నిర్వహించారు. ఓ శునకం కార్డియో పల్మోనరీ రెసిస్టేషన్‌-సీపీఆర్‌(అత్యవసర పరిస్థితుల్లో శ్వాస ఆగినప్పుడు ఛాతిని తట్టి అందించే వైద్యం)ను ఇచ్చే విధానాన్ని చూపిస్తూ కనిపించింది.

Image:Eenadu


కరీంనగర్‌లోని ఎన్జీవో ఆడిటోరియంలో శనివారం పోషణ్ అభియాన్‌లో భాగంగా పోషకాహార పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు, యువతులు పాల్గొని బతుకమ్మ వేడుకలు చేసుకున్నారు..

Image:Eenadu

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి వద్ద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నూతన అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా అంబులెన్స్‌ను నడిపారు.

Image:Eenadu

శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జునస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు కల్వకుర్తి వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు.

Image:Eenadu

హైదరాబాద్‌లోని హామ్‌స్టెక్‌ కళాశాలకు చెందిన డిజైనింగ్‌ విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్‌ నిర్వహించిన ర్యాంప్‌వాక్‌ చూపరులను ఆకట్టుకుంది.

Image:Eenadu


హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్‌లో శాన్వీ, ధ్రువ విద్యాసంస్థల స్నాతకోత్సవ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థినులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

Image:Eenadu


అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లోని ఓ పాఠశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలు

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home