చిత్రం చెప్పే విశేషాలు..! (25-09-2022/2)

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది ఘోస్ట్’. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల గ్రౌండ్‌లో జరగనున్న చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్ కోసం నాగార్జున, ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్‌, నటి సోనాల్‌ చౌహాన్‌ ప్రత్యేక విమానంలో బయలుదేరారు.

Image:Eenadu

సినీనటుడు జగపతిబాబుకు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హెయిర్‌ స్టైల్‌ చేశారు. ఈ ఫొటోను జగపతిబాబు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. యాక్షన్‌ కింగ్‌తో ఆదివారం యాక్షన్‌ అని పోస్టు పెట్టారు.

Image:Eenadu

మాజీ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌ ఖాజాగూడలో స్పర్శ హాస్పిస్‌ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్యాన్సర్‌ రోగులను ఆయన పరామర్శించారు. అనంతరం కేంద్రం నిర్వాహకులు సునీల్‌ గావస్కర్‌తో కేకు కోయించారు.

Image:Eenadu

బతుకమ్మ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది తంగేడు పువ్వు. ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ పండగ ఉండగా.. ఓ తూనీగ తంగేడు పూల నుంచి తేనె మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న దృశ్యాలు కూకట్‌పల్లిలోని రామాలయం ఆవరణలో కనువిందు చేశాయి.

Image:Eenadu

గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెజస అధినేత కోదండరాం.. రాష్ట్ర సాధనలో అమరులైన వారి సంస్మరణార్థం బియ్యమిచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు.

Image:Eenadu

ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ నేపథ్యంలో అభిమానులు తరలివస్తున్నారు. ఆ పరిసరాల్లో ఓ క్రీడాభిమాని విచిత్ర వేషధారణతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

Image:Eenadu 


ఆదివారం బాపట్ల జిల్లా బాపట్ల మండలం మురుకొండపాడు సమీపంలోని పొలాల్లో ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయ కృష్ణన్‌ దంపతులు.. వారి పిల్లలు వ్యవసాయ కూలీలతో కలిసి నాట్లు వేశారు. అనంతరం గట్టుపై కూర్చొని భోజనం చేశారు.

Image:Eenadu

పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home