చిత్రం చెప్పే విశేషాలు..! (19-10-2022/2)

అనంతపురంలోని కల్లూరు-పామిడి రహదారిలో సుమారు 2నెలలుగా వరద ఉద్ధృతి తగ్గలేదు. ఎంపీఆర్‌ డ్యామ్‌ నుంచి దిగువకు వదిలిన నీటి కారణంగా ఈ ప్రవాహం గత కొంతకాలంగా కొనసాగుతోంది. దీంతో అరకిలోమీటరు మేర రహదారి చాలాచోట్ల కోతకు గురైంది.

#Eenadu

కార్తి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సర్దార్‌’. రాశీఖన్నా, రజీషా విజయన్‌ కథానాయికలు కాగా లైలా ఓ కీలక పాత్రలో మెరిశారు. బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన రజీషా విజయన్‌, లైలా సెల్ఫీలు తీసుకుంటూ, కబుర్లు చెబుతూ సరదాగా కనిపించారు.

#Eenadu

ప్రగతిభవన్ నుంచి బేగంపేట్ వెళ్లే వంతెనపై ఉన్న కళాకృతులు చూపరులను ఆకట్టుకునేలా జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగులతో మెరుగులు దిద్దారు.

#Eenadu

నాంపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకులు మునుగోడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రజలకు నగదు పంపిణీ చేశారు. సుమారు 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

#Eenadu

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పల్నాడులో నీట మునిగిన పంటలను పరిశీలించి రైతుల బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ కాలువ గట్టును ఇలా దాటుతూ కనిపించారు..

#Eenadu

కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మల్లికార్జున్‌ ఖర్గేను పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అభినందించారు. కార్యక్రమంలో ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు.

#Eenadu

గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి మహిళలు పూలతో ఘన స్వాగతం పలికారు.

#Eenadu

ప్రమిదల పండగ దీపావళి వచ్చేస్తోంది. మార్కెట్లో రకరకాల ప్రమిదలు విక్రయిస్తున్నారు. వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి నీటితో వెలిగే ఈ దీపాలు. బ్యాటరీ సహాయంతో పనిచేసే ప్రమిదలో నీరు పోస్తే వత్తి ఆకారంలోని బల్బు వెలుగుతుంది. నీరు తీసేయగానే దీపం ఆరిపోతుంది.

#Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home