చిత్రం చెప్పే విశేషాలు..! (20-10-2022/2)

జమ్మూ కశ్మీర్‌లో శీతాకాలం రాకముందే మంచు కురవడం ప్రారంభమైంది. అక్కడి గుల్మార్గ్‌, సోనామార్గ్‌ తదితర ప్రాంతాల్లో మంచు దుప్పటి పరుచుకున్న కొండలు, మైదానాలు, చెట్లు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

#Eenadu

భారత్‌ జోడో యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ మంత్రాలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి గురు రాఘవేంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

#Eenadu

‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినీనటుడు రామ్‌చరణ్‌ జపాన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా చెర్రీ తన సతీమణి ఉపాసనతో కలిసి అక్కడ సందడి చేశారు. రామ్‌చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ శుక్రవారం జపాన్‌లో విడుదల కానుంది.

#Eenadu

ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెగా 154’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను ఈ నెల 24న ఉదయం 11.07గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది..

#Eenadu

బ్రెజిల్‌లో కరవు పరిస్థితుల కారణంగా అక్కడి సొలిమెయిస్‌ నదిలో నీరు అడుగంటుతోంది. దీంతో నదిలోని హౌజ్‌ బోట్లు నేలను తాకుతున్నాయి.

#Eenadu

మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌.. వీరేంద్ర సెహ్వాగ్‌కు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘బౌండరీల మీద బౌండరీలు కొడుతూ 44(సెహ్వాగ్‌ వయసునుద్దేశించి)కు చేరుకున్నావు. ఇప్పుడు 50కి చేరుకునేందుకు ఓ సిక్స్‌ బాదు’ అంటూ సచిన్ ఫన్నీగా పోస్టు పెట్టారు.

#Eenadu

సినీనటి నజ్రియా నజీమ్‌ దుబాయ్‌లో విమానం నుంచి స్కై జంప్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. తన కలలు నిజమయ్యాయని తెలుపుతూ పోస్టు పెట్టారు.

#Eenadu

హైదరాబాద్‌ సోమాజీగూడలోని ఓ నగల దుకాణంలో నూతన వజ్రాభరణాల కలెక్షన్‌ను సినీనటి రాశీ ఖన్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె వివిధ రకాల నగలను ధరించి సందడి చేశారు.

#Eenadu

భారత పర్యటనలో ఉన్న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ కేవడియాలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని సందర్శించారు. ఇరువురు అక్కడ వివిధ అంతర్జాతీయ అంశాలపై చర్చించుకున్నారు.

#Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home