చిత్రం చెప్పే విశేషాలు..! (21-10-2022/2)

హైదరాబాద్‌లో నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనం శుక్రవారం రాత్రి విద్యుద్దీపాల కాంతులతో ధగధగలాడుతూ కనిపించింది.

#Eenadu

నిరుపయోగంగా ఉన్న ఓ ఆర్టీసీ బస్సును హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి ముషీరాబాద్‌ ఆర్టీసీ డిపోనకు తరలించారు. ఆర్టీసీ బస్సును ఇలా లాక్కెళ్లడంతో పలువురు ఆసక్తిగా గమనించారు.

#Eenadu

రామ్‌చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా నేడు జపాన్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఓ జపాన్‌ అభిమాని చెర్రీకి శునకాల బొమ్మలను కానుకగా ఇచ్చింది.

#Eenadu

శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌ తిరిగి సొంతగూటికి చేరారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని పార్టీలోకి ఆహ్వానించారు.

#Eenadu

మునుగోడు మండలం చెల్మెడ గ్రామంలో భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో కలిసి కోలాటం ఆడారు.

#Eenadu

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యాలతో కలిసి దిగిన ఫొటోను రిషభ్‌ పంత్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘అలెక్సా.. చక్‌దే ఇండియా పాట ప్లే చెయ్‌’ అంటూ ఫన్నీగా పోస్టు పెట్టారు.

#Eenadu

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఈ సినిమా నేడు జపాన్‌లో విడుదల కావడంతో ప్రీమియర్‌ షో వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ తన సతీమణి లక్ష్మీప్రణతితో కలిసి సందడి చేశారు.

#Eenadu

ప్రధాని నరేంద్రమోదీ దేవభూమి ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా బద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీటితో పాటు అక్కడి ఆదిశంకరాచార్య సమాధిని ఆయన సందర్శించారు.

#Eenadu

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి దివ్య శ్రీపాద పాల్గొని సందడి చేశారు. ఇటీవల విడుదలైన ‘స్వాతిముత్యం’ సినిమాలో దివ్య శ్రీపాద తన నటనతో ఆకట్టుకున్నారు.

#Eenadu

ధన త్రయోదశి సందర్భంగా బంజారాహిల్స్‌లోని ఓ నగల దుకాణంలో నూతన కలెక్షన్లు ఏర్పాటు చేశారు. వీటిని నటీమణులు స్పందన, చాందిని, ప్రీతి సుందర్‌, ఇతర మోడళ్లు కలిసి ఆవిష్కరించారు. వినూత్న ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిస్తూ హొయలు పోయారు.

#Eenadu

తాను కళ్లద్దాలు వాడుతున్న చిత్రాన్ని ట్విటర్‌లో పోస్టు చేస్తూ మంత్రి కేటీఆర్‌ ఓ సరదా వ్యాఖ్య రాశారు. ‘కళ్లద్దాలు లేకుండా చదవలేకపోతున్నాను అంటే కొంతసేపు నమ్మబుద్ధి కావడం లేదు. అధికారికంగా నాకు వయసు మీదపడుతోంది’ అంటూ తన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.

#Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home