చిత్రం చెప్పే విశేషాలు..! (22-10-2022/1)

ముద్దుగుమ్మలు నగలతో మెరిసిపోయారు. జూబ్లీహిల్స్‌లో శుక్రవారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో సినీతారలు ప్రీతి సుందర్‌, స్పందన పల్లి, చాందిని భగ్వనాని కంఠహారాలు ధరించి సందడి చేశారు.

#Eenadu

కర్నూల్‌జిల్లా మంత్రాలయంలో శుక్రవారం ప్రారంభమైన భారత్‌ జోడోయాత్రలో రాహుల్‌గాంధీ హనుమకొండ జిల్లా సిద్ధార్థనగర్‌కు చెందిన సారారెడ్డిని భుజాలపై ఎత్తుకుని కొంతదూరం నడిచారు. కాంగ్రెస్‌ నాయకులు తక్కళ్లపల్లి సాగరిక, గొట్టిముక్కుల రమాకాంత్‌రెడ్డి దంపతుల కుమార్తె సారారెడ్డి.

#Eenadu

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం శుక్రవారం నగరంలో పలుచోట్ల జరిగింది. వివిధ విభాగాల అధిపతులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని పోలీసు అమరులకు నివాళులర్పించారు. అంబర్‌పేట సీపీఎల్‌లో అమరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌

#Eenadu

మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌ దీపావళి కళ సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 30కి పైగా వాహనాల్లో దాదాపు 15టన్నుల బంతిపూలు మార్కెట్‌కు దిగుమతి అయినట్లు మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. శుక్రవారం కిలో చామంతి రూ.150, బంతిపూలు రూ.30లు పలికాయి.

#Eenadu

నవనందుల కోటగా పేరుగాంచిన నంద్యాలకు భారీ నంది తరలొచ్చింది. స్థానిక రైల్వే స్టేషన్లో నందీశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. పది అడుగుల ఎత్తు, సుమారు 20 అడుగుల పొడవు ఉన్న భారీ రాతి విగ్రహాన్ని శుక్రవారం గుంటూరు నుంచి తీసుకొచ్చారు.

#Eenadu

హైదరాబాద్ నగర శివారు కన్హశాంతివనంలోని హోటల్‌లో చెట్టు కాండంలోని ఉపయోగపడని మొద్దుతో తయారుచేసిన టీపాయి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. వృథాగా పడిఉన్న భారీ వృక్షం కాండాన్ని ఇలా ఆకట్టుకునేలా తీర్చిదిద్ది హాల్‌లో ఏర్పాటు చేశారు.

#Eenadu

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న డిఫెన్స్‌ ఎక్స్‌ఫోలో శుక్రవారం డ్రోన్ల ద్వారా ప్రదర్శించిన దీపం ఆకృతి.

#Eenadu

మునుగోడులో మహిళకు బొట్టు పెట్టి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న రంగారెడ్డి జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ నీరటి తన్వి. చిత్రంలో రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌ టి.అనితారెడ్డి.

#Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home