చిత్రం చెప్పే విశేషాలు..! (22-10-2022/2)

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద శనివారం ఉదయం మంచు తెరల మధ్య చేపలు పడుతున్న మత్స్యకారులు.

#Eenadu

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో లకోటియా ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థినులు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పాటలు, నృత్య ప్రదర్శనలతో పాటు దీపాలు వెలిగించి వేడుకలు చేసుకున్నారు.

#Eenadu

దీపావళి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో మట్టి ప్రమిదలు కొనుగోలు చేశారు. అనంతరం పేటీఏం ద్వారా నగదును డిజిటల్‌ విధానంలో చెల్లించారు.

#Eenadu

ఇటీవల కురిసిన వర్షాలకు వికారాబాద్‌ జిల్లాలోని కోట్‌పల్లి రిజర్వాయర్‌ జలకళ సంతరించుకుంది. దీంతో శనివారం వారాంతం కావడంతో ప్రాజెక్టు వద్ద పర్యాటకులు బోటింగ్‌ చేస్తూ, జలకాలాడుతూ సందడి చేశారు.

#Eenadu

నాంపల్లి మండలం దామెర గ్రామంలో తెరాస ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మహిళ.. సీఎం కేసీఆర్‌, కారు, తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఫొటోలతో బోనమెత్తి వినూత్నంగా కనిపించారు.

#Eenadu

సినీనటుడు విశాల్‌ కడపలోని దర్గాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాలారోజులుగా ఈ దర్గాను దర్శించుకోవాలని అనుకుంటున్నట్లు.. ఈరోజు సమయం కుదిరిందని ఆయన తెలిపారు.

#Eenadu

మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వరుడి ఆలయాన్ని సినీనటి పూనమ్‌ కౌర్‌ దర్శించుకున్నారు. ఇటీవల ఈ ఆలయంలో నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

#Eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర కర్ణాటకలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని రాయ్‌చూర్‌లో మాజీ సైనికులు ఆయనతో కలిసి జాతీయ జెండాలను చేతపట్టి పాదయాత్రగా ముందుకు సాగారు.

#Eenadu

టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌ కోసం భారత ఆటగాళ్లు మెల్‌బోర్న్‌లోని క్రికెట్‌ మైదానంలో సాధన చేస్తూ కనిపించారు.

#Eenadu

సికింద్రాబాద్‌లోని బోయగూడాలో రోజ్గార్‌ మేళా నిర్వహించారు. గతంలో శిక్షణ పొందిన పలువురికి వివిధ రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తూ నియామక పత్రాలను అందజేశారు. పలువురు యువతులు అక్కడ ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్రమోదీ కటౌట్‌ వద్ద ఫొటోలు తీసుకుంటూ సంబరపడ్డారు.

#Eenadu

నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన నూతన నగల దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి కృతిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నూతన డిజైన్ల ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

#Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home