చిత్రం చెప్పే విశేషాలు..! (23-10-2022/2)

దీపావళి సందర్భంగా విద్యుద్దీప కాంతుల అలంకరణతో ఆకట్టుకుంటున్న హైదరాబాద్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌ కూడలి.

#Eenadu

దీపావళి సందర్భంగా టపాసులు, పండగ సామగ్రి కొనుగోళ్లతో అహ్మదాబాద్‌లోని వ్యాపార సముదాయాలు కొనుగోలుదారులతో ఇలా కిక్కిరిసి కనిపించాయి.

#Eenadu

ప్రకాశం జిల్లా ఒంగోలులో మహిళలు దీపాలు వెలిగించి ఘనంగా దీపావళి వేడుకలు చేసుకున్నారు.

#Eenadu

ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలోని రామ్‌ లల్లాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన ఆదివారం దీపావళి సందర్భంగా అయోధ్యలో దీపోత్సవాన్ని ప్రారంభించారు.

#Eenadu

అయోధ్యలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో ఆలయంతో పాటు అయోధ్య పట్టణ పరిసరాలన్నీ దీపాల కాంతులతో చూపరులను ఆకట్టుకున్నాయి.

#Eenadu

ధన త్రయోదశి సందర్భంగా హైదరాబాద్‌లోని సిద్దంబర్‌ బజార్‌లో నగల దుకాణాల వద్ద బంగారం, వెండి కొనుగోలు కోసం నగరవాసులు బారులు తీరారు.

#Eenadu

హైదరాబాద్‌లోని హోటల్‌ మారియట్‌లో ‘క్రియేటీవ్‌ గ్లోబల్‌ వుమెన్‌’ సభ్యులు సందడిగా దీపావళి వేడుకలు చేసుకున్నారు.

#Eenadu

ప్రపంచ రొమ్ము క్యాన్సర్‌ మాసోత్సవం సందర్భంగా దోమలగూడ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు అవగాహన నడక నిర్వహించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ జెండా ఊపి ఈ నడకను ప్రారంభించారు.

#Eenadu

న్యూజెర్సీలోని మెడ్‌ఫోర్డ్‌ సరస్సులో హాలోవీన్‌ వేడుక నిర్వహించారు. మంత్రగత్తెల్లా దుస్తులు ధరించిన పలువురు ఔత్సాహికులు పెడల్‌బోర్డులపై కదలికలు సాగిస్తూ ఆకట్టుకున్నారు.

#Eenadu

హైదరాబాద్‌లోని సుచిత్రలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ మండీ ప్రారంభోత్సవంలో సినీనటుడు కార్తికేయ పాల్గొని సందడి చేశారు.

#Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home