చిత్రం చెప్పే విశేషాలు..! (25-10-2022/2)
సమంత ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమా ‘యశోద’. దర్శకద్వయం హరి- హరీష్ సంయుక్తంగా తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా మలయాళం ట్రైలర్‌ను యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ గురువారం ఆవిష్కరించనున్నారని పేర్కొంటూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను విడుదల చేసింది.
#Eenadu
అహ్మదాబాద్, దిల్లీ నగరాల్లో సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో పక్షులు ఎగురుతున్న అందమైన దృశ్యాలివి.
#Eenadu
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముంబయికి చెందిన గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు సాగర్ కాంబ్లి ఈ చిత్రాలను గీశారు.
#Eenadu
‘సిత్రాంగ్’ తుపాను బంగ్లాదేశ్‌లోని భోలా జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. బే ఆఫ్ బెంగాల్ తీరంలోని ఛార్‌ఫాసన్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం తుపాను ధాటికి కూలిపోయిన తమ నివాసంలోని వస్తువులను ఇలా వెతుకుతూ కనిపించింది.
#Eenadu
దేశ రాజధాని దిల్లీలో పేల్చిన బాణసంచా కారణంగా గాలి నాణ్యత అట్టడుగు స్థాయికి చేరింది. దీపావళి సందర్భంగా దిల్లీవాసులు పెద్దఎత్తున బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దీంతో ఈ ఉదయం గాలి నాణ్యత సూచి 323 వద్ద ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.
#Eenadu
భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి.. తమిళనాడులోని రామేశ్వరంలోని ‘‘న్యూ పంబన్ బ్రిడ్జి’’ని వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేలా రైల్వేశాఖ కృషి చేస్తోంది. ఇప్పటి వరకు 81శాతం పనులు పూర్తయినట్లు పేర్కొంటూ ఈ చిత్రాలను ట్విటర్‌లో పోస్టు చేసింది.
#Eenadu
వైట్‌హౌస్‌లో నిర్వహించిన దీపావళి వేడుకలో పాల్గొని దీపాలు వెలిగిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. పక్కన ఆయన సతీమణి జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తదితరులు
#Eenadu
దీపావళి పండగ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ రక్కసిని దహనం చేశారు. సీఎం కేసీఆర్ కృషితో ప్రజలకు సురక్షిత తాగునీరు అందుతోందని చెబుతూ పలువురు బాధితులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
#Eenadu
పాక్షిక సూర్యగ్రహణం ముగియడంతో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేసి పుణ్య స్నానాలు ఆచరించారు.
#Eenadu