చిత్రం చెప్పే విశేషాలు..! (26-10-2022/2)

హైదరాబాద్‌లో సదర్ ఉత్సవానికి సిద్ధం అవుతున్న దున్నరాజులను పూలతో అలంకరించి ట్యాంక్‌బండ్‌ వరకు తీసుకువచ్చి విన్యాసాలు చేయించారు. ఓ దున్నరాజుపై కేశాలను ప్రత్యేక డిజైన్‌లో కత్తిరించడంతో ఆకట్టుకుంది.

#Eenadu

కర్నూలులోని పోలీసు పరేడ్‌ మైదానంలో ఓపెన్‌ హౌస్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పోలీసులు ఆయుధాల పనితీరు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని సరదాగా ఎకే47 గన్‌ను ఎక్కుపెట్టి కనిపించింది.

#Eenadu

సెప్టెంబర్‌ రెండో వారం తర్వాత ఎగువన కురిసిన వర్షాలతో ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ జలాశయం జలకళ సంతరించుకుంది. దీంతో బోటింగ్‌కు అనుమతినివ్వడంతో యాత్రికులు ఉత్సాహంగా తరలివస్తున్నారు.

#Eenadu

ఉక్రెయిన్‌లోని మైకోలెయివ్‌ జూలో రెండు ఏనుగులు తమ తొండాలు, దంతాలను కలిపి ఆడుతూ కనిపించాయి. ఏనుగులు ఒకదానికొకటి శుభాకాంక్షలు తెలిపాయా? అన్నట్లుగా ఈ చిత్రం కనిపించింది.

#Eenadu

కార్తిక మాసం ప్రారంభమైన నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు పంచముఖేశ్వర స్వామి ఆలయంలో కార్తిక అఖండ జ్యోతిని వెలిగించారు.

#Eenadu

మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ రోడ్డు పక్కన చెట్ల కింద కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు.

#Eenadu

రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత బుధవారం లండన్‌లోని డౌనింగ్‌ స్ట్రీట్‌లో తొలి కేబినెట్‌ సమావేశం నిర్వహించారు.

#Eenadu

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదివాసీలు నిర్వహించుకునే ఈ దండారీ ఉత్సవాలకు భాజపా అధికారంలోకి వస్తే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.

#Eenadu

సిరియాలో పరిస్థితులు కొంత మెరుగుపడటంతో సరిహద్దు లెబనాన్‌ దేశంలోని అర్సల్‌ పట్టణంలో ఇన్నాళ్లు తలదాచుకున్న పలువురు సిరియన్లు వాహనాల్లో స్వదేశానికి బయలుదేరారు.

#Eenadu


తిరుమలలోని ధ్యానారామంలో శివలింగానికి ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. నెల రోజుల పాటు ఈ రుద్రాభిషేకాలు కొనసాగనున్నాయి.

#Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home