చిత్రం చెప్పే విశేషాలు..! (27-10-2022/2)

సినీనటుడు నాని.. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి అంజన యలవర్తితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. తమ బంధానికి 10ఏళ్లు పూర్తయినట్లు తెలిపారు.

#Eenadu

రాష్ట్రపత్రి ద్రౌపదీ ముర్ము భద్రతా సిబ్బంది గురువారం రాత్రి గుర్రాలపై ఆకట్టుకునే విన్యాసాలు చేశారు. అనంతరం ద్రౌపదీ ముర్ము వారి ప్రదర్శన బాగుందని ప్రశంసించారు.

#Eenadu

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని పీఎం లంకలో గత కొంతకాలంగా సముద్ర తీరం కోతకు గురవుతోంది. దీంతో ఆ ప్రదేశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పరిశీలించి రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

#Eenadu

1947 అక్టోబర్‌ 27న భారత బలగాలు శ్రీనగర్‌లోని భారత ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ప్రవేశించిన ఘట్టాన్ని గురువారం సైనికులు పునః సృష్టించారు. సరిగ్గా ఈ రోజున 1947లో భారత ఆర్మీ తొలిసారిగా జమ్మూ-కశ్మీర్‌ను ఆక్రమించాలనుకున్న పాకిస్థాన్‌ ఆర్మీని ఎదుర్కొని విజయం సాధించింది.

#Eenadu

మునుగోడు ఎన్నికలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి డా.వీరభోగ వసంతరాయలు వినూత్నంగా గుర్రంపై ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని ఉప్పరిగూడేనికి చెందిన ఆయన నామినేషన్‌ సైతం గుర్రంపై వచ్చి వేయడం విశేషం.

#Eenadu

మాజీ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తన సతీమణి సాక్షిసింగ్‌తో కలిసి ఓ శీతల ప్రాంతానికి పర్యటనకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సాక్షిసింగ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు.

#Eenadu

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ 21అడుగుల భారీ ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని తెనాలి శిల్పులు రూపొందించారు. శిల్పశాల వద్ద ప్రదర్శనకు ఉంచిన దీన్ని ఎమ్మెల్యే శివకుమార్ పరిశీలించారు. ఈ విగ్రహాన్ని త్వరలో బెంగళూరుకు తరలించనున్నారు.

#Eenadu

తమిళ నటుడు విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారుసుడు’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుపుతూ చిత్రబృందం అందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. విజయ్‌తో పాటు రష్మిక మందాన, ఖుష్బూ, జయసుధ తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు.

#Eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఇవాళ నారాయణపేట జిల్లాలో తిరిగి ప్రారంభమైంది. మక్తల్ సమీపంలోని 33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నుంచి గుడిగండ్ల వరకు ఈ ఉదయం ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన కళాకారులతో కలిసి డోలు వాయిస్తూ సందడి చేశారు.

#Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home