చిత్రం చెప్పే విశేషాలు..! (28-10-2022/2)

నారాయణపేట జిల్లాలో ‘భారత్ జోడో యాత్ర’ చేస్తున్న రాహుల్ గాంధీని ఖమ్మం జిల్లా బాణాపురానికి చెందిన డప్పు కళాకారులు కలిశారు. కళాకారులతో కలిసి రాహుల్‌ కాసేపు డప్పు కొడుతూ ఆకట్టుకున్నారు.

#Eenadu

‘నాసా సన్’ తన ట్విటర్‌ ఖాతాలో సూర్యుడికి సంబంధించిన ఆసక్తికర ఫొటోను పంచుకుంది. ఇందులో సూర్యుడు నవ్వుతున్నట్లుగా స్మైలీ ఫేస్‌తో కనిపించాడు. ‘నాసా సన్‌’ సూర్యుడు స్మైల్ ఇస్తున్నాడని తెలుపుతూ ఫన్నీగా పోస్టు పెట్టింది.

#Eenadu

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని పుష్కర్‌లో బ్రహ్మ దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో పాటు అక్కడి అజ్మీర్‌ షరీఫ్‌ దర్గాను దర్శించుకొని ప్రార్థనలు చేశారు.

#Eenadu

ఇంగ్లాండ్‌లోని ఉత్తర నార్‌ఫోల్క్‌ పట్టణంలోని ఆక్స్‌నీడ్‌ హాల్‌లో ఏటా సుమారు 100 వివాహాలు జరుగుతుంటాయి. కానీ.. ఇటీవల ఇక్కడ ‘దయచేసి వధూవరులు రావద్దు’ అనే బోర్డులు వెలిశాయి. కారణం.. శుభకార్యాలకు వచ్చే అతిథులు అక్కడి తోటల వద్ద మూత్రవిసర్జన చేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేయడమే!

#Eenadu

రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలో 369 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ‘విశ్వాస్‌ స్వరూపం’ను ఏర్పాటు చేశారు. దీన్ని శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలో అతి పెద్ద శివుడి విగ్రహం ఇదేనని నిర్వాహకులు చెబుతున్నారు.

#Eenadu

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.

#Eenadu

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో భాజపా ప్రమేయం లేదని చెబుతూ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు..

#Eenadu

మునుగోడు ఎన్నికల్లో భాగంగా వివిధ పార్టీల నాయకులు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌.. ఫుల్‌ బనియన్‌, తువ్వాల ధరించి ఓటర్లకు నమస్కారాలు పెడుతూ ప్రచారం చేశారు.సినీనటి జీవిత ఓ మహిళకు గోరింటాకు పెట్టి భాజపాకు ఓటు వేయాలని కోరారు.

#Eenadu

‘నాసా సన్’ తన ట్విటర్‌ ఖాతాలో సూర్యుడికి సంబంధించిన ఆసక్తికర ఫొటోను పంచుకుంది. ఇందులో సూర్యుడు నవ్వుతున్నట్లుగా స్మైలీ ఫేస్‌తో కనిపించాడు. ‘నాసా సన్‌’ సూర్యుడు స్మైల్ ఇస్తున్నాడని తెలుపుతూ ఫన్నీగా పోస్టు పెట్టింది. #Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home