చిత్రం చెప్పే విశేషాలు..!

(26-09-2022/2)

అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ నెల 29న టీజర్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Source: Eenadu

నటి కాజల్‌ అగర్వాల్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన కాజల్‌తో పలువురు అభిమానులు ఫొటోలు దిగారు.

Source: Eenadu

తుమ్మలగుంట శ్రీ కల్యాణ వెంకన్న ఆలయాన్ని త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సందర్శించారు. అనంతరం అక్కడి వేద పాఠశాలను, ఆలయ పుష్కరిణి, పరిసరాలను చిన్నజీయర్‌ స్వామి పరిశీలించారు.

Source: Eenadu

చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని సిద్దిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్‌లో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు.

Source: Eenadu

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ‘సూత్ర దీపావళి ఎగ్జిబిషన్‌’ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

ఫిలిప్పీన్స్‌లో ‘నోరు’ తుపాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా పలువురు మృతి చెందారు. అక్కడి అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు చేపట్టారు.

Source: Eenadu

మంత్రి కేటీఆర్‌ బాసర ఐఐఐటీలో విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home